దేవుని వాక్యంలో ఉన్న సంపద
యెహోవా ఓపికకు హద్దులు ఉన్నాయి
అష్షూరు ఇశ్రాయేలును జయించేలా యెహోవా అనుమతించాడు (2రా 17:5, 6; it-2-E 908వ పేజీ, 5వ పేరా)
చెడ్డపనులు చేస్తూ తనకు కోపం తెప్పించినందుకు యెహోవా తన ప్రజల్ని శిక్షించాడు (2రా 17:9-12; it-1-E 414-415 పేజీలు)
యెహోవా ఇశ్రాయేలు విషయంలో ఓపిక చూపిస్తూ వాళ్లను పదేపదే హెచ్చరించాడు (2రా 17:13, 14)
ప్రేమగల మన పరలోక తండ్రి అపరిపూర్ణ మనుషుల విషయంలో చాలా ఓపిక చూపిస్తున్నాడు. (2పే 3:9) కానీ తన ఉద్దేశం నెరవేర్చడం కోసం, ఆయన అతి త్వరలోనే చెడ్డవాళ్లందర్నీ నాశనం చేస్తాడు. ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే పాటించడానికి, అత్యవసర భావంతో ప్రకటించడానికి ఇది మనకు ఎలా సహాయం చేస్తుంది?