మన క్రైస్తవ జీవితం
యెహోవా మన పనిని గుర్తుంచుకుంటాడు
వేరేవాళ్ల కోసం మనం పడుతున్న కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదని, మన కృషిని మర్చిపోతున్నారని మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు. మరి యెహోవా సేవలో మనం చేసే పని సంగతేంటి? తన సేవలో మనం నిండు హృదయంతో చేసే కృషిని ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఆయన దాన్ని విలువైనదిగా చూస్తాడు. అనారోగ్యం వల్ల మనం ఆయన సేవలో ఎక్కువ చేయలేకపోయినా, ఆయన మనల్ని విడిచిపెట్టడు.—హెబ్రీ 6:10.
యెహోవా గుర్తుంచుకుంటాడు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
సహోదరుడు హిబ్ష్మన్, వేర్వేరు నియామకాల్లో ఎలా కష్టపడి పనిచేశాడు?
-
ఆయన భార్య చనిపోయినప్పుడు, వృద్ధాప్యం వల్ల దేవుని సేవ ఎక్కువ చేయలేకపోయినప్పుడు యెహోవా ఆ సహోదరుణ్ణి ఎలా గుర్తుంచుకున్నాడు?
-
సహోదరుడు పూర్తికాల సేవలో ఎన్నో ఆశీర్వాదాలు పొందాడని ఎలా చెప్పవచ్చు?—సామె 10:22