మన క్రైస్తవ జీవితం
అర్హతలు సాధించడానికి క్రైస్తవులు ఎందుకు కృషిచేయాలి?
సహోదర సహోదరీలు పయినీరు సేవలో, బెతెల్ సేవలో, రాజ్యమందిర నిర్మాణ పనిలో అడుగుపెట్టడానికి కృషిచేస్తారు. సహోదరులైతే, పర్యవేక్షకులు అవ్వడానికి కూడా కృషిచేస్తారు. (1తి 3:1) దానర్థం క్రైస్తవులు ఏదైనా బాధ్యత లేదా స్థానం కోసం ఆరాటపడాలా?
అర్హతలు సాధించడానికి ఎందుకు కృషిచేయాలి? (1తి 3:1) వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
క్రైస్తవులు ముఖ్యంగా ఏ మూడు కారణాల్ని బట్టి అర్హతలు సాధించడానికి కృషిచేయాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి?