మన క్రైస్తవ జీవితం
“ఇవ్వడం అలవాటు చేసుకోండి”
ప్రజలు ఒకరిని చూసి ఒకరు, ఇచ్చే గుణాన్ని అలవాటు చేసుకుంటారని యేసు చెప్పాడు. (లూకా 6:38) మీరు ఇవ్వడం అలవాటు చేసుకుంటే, మిమ్మల్ని చూసి సహోదర సహోదరీలు కూడా దయగా, విస్తారంగా ఇవ్వడం అలవాటు చేసుకుంటారు.
సంతోషంగా ఇవ్వడం మన ఆరాధనలో ఒక భాగం. అవసరంలో ఉన్న తోటి క్రైస్తవులకు ఉదారంగా ఇచ్చేవాళ్లను యెహోవా గమనిస్తాడు. వాళ్లకు ప్రతిఫలం ఇస్తానని ఆయన మాటిస్తున్నాడు.—సామె 19:17.
మీరు అలవాటుగా ఇస్తున్న విరాళాలకు చాలా థాంక్స్ వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
సహోదర సహోదరీలకు సహాయం చేయడానికి మీరు ఇచ్చే విరాళాల్ని సంస్థ ఎలా ఉపయోగిస్తుంది?
-
మన విరాళం చిన్నదైనా, పెద్దదైనా మనం ఎందుకు ఇచ్చే గుణాన్ని చూపిస్తూనే ఉండాలి?—“ఒకరి సమృద్ధి వేరేవాళ్ల అవసరాల్ని తీరుస్తుంది” అనే jw.org ఆర్టికల్ చూడండి.