మన క్రైస్తవ జీవితం
మనకున్న మంచి పేరును కాపాడడానికి నేనేం చేస్తానంటే …
యెహోవాసాక్షుల ప్రవర్తనను జనం గమనిస్తూ ఉంటారు. (1కొ 4:9) మనం ఈ ప్రశ్న వేసుకోవచ్చు: ‘నా మాటలు, పనులు యెహోవాకు మహిమ తెస్తున్నాయా?’ (1పే 2:12) ఎన్నో సంవత్సరాలుగా యెహోవాసాక్షులు మంచి పేరును సంపాదించుకున్నారు. దాన్ని పాడుచేసే ఏ పనీ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలనుకోం.—ప్రస 10:1.
ఈ సందర్భాల్లో ఒక క్రైస్తవుడు ఏం చేయాలో రాయండి, అలాగే ఉపయోగపడే ఒక బైబిలు సూత్రం రాయండి:
-
సత్యంలో లేని ఒకతను కోపంగా మిమ్మల్ని అనరాని మాటలు అంటే
-
మీ బట్టలు, వాహనం, లేదా ఇల్లు శుభ్రంగా లేకపోతే
-
మీ ప్రాంతంలోని ఒక చట్టం సరైనది కాదని, లేదా పాటించడానికి కష్టంగా ఉందని మీకు అనిపిస్తే
మనకున్న మంచి పేరును కాపాడడానికి, రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న పరిశోధకులు ఎలా కృషి చేస్తారు?
సత్యం మీద ప్రేమ, గౌరవం కలిగించడం అనే వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:
ఖచ్చితమైన సమాచారాన్ని సిద్ధం చేయడానికి సంస్థ చేసే కృషి చూసి మీకు ఏమనిపిస్తుంది?