కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

తల్లిదండ్రులారా, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మీ పిల్లలకు నేర్పించండి

తల్లిదండ్రులారా, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మీ పిల్లలకు నేర్పించండి

యెహోవా పిల్లల్ని చాలా అమూల్యంగా చూస్తాడు. వాళ్ల ఆధ్యాత్మిక ఎదుగుదలను, సహనాన్ని ఆయన గమనిస్తాడు. (1స 2:26; లూకా 2:52) వాళ్లు చిన్న పిల్లలైనా సరే, తమ మంచి ప్రవర్తన ద్వారా యెహోవా హృదయాన్ని సంతోషపెట్టవచ్చు. (సామె 27:11) యెహోవా తన సంస్థ ద్వారా చక్కని పనిముట్లు ఇచ్చాడు. వాటి సహాయంతో, తల్లిదండ్రులు తమ పిల్లలకు యెహోవాను ప్రేమించడం, ఆయనకు లోబడడం నేర్పించవచ్చు.

పిల్లలారా—మీరు పట్టువిడవకుండా ముందుకు సాగితే యెహోవా సంతోషిస్తాడు! అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • యెహోవా గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు ఎలా సహాయాన్ని, నిర్దేశాన్ని ఇచ్చాడు?

  • తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ఇప్పుడు ఏ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి?

  • మీరు పిల్లలైతే, యెహోవా ఇచ్చిన ఏ బహుమతి మీకు బాగా ఉపయోగపడింది? ఎందుకు?