మన క్రైస్తవ జీవితం
“కొంత తీసి పక్కకు పెట్టండి”
మనం విరాళాల్ని అప్పటికప్పుడు ఇచ్చే బదులు, అపొస్తలుడైన పౌలు సలహా ఇచ్చినట్టు, క్రమంగా ‘కొంత తీసి పక్కకు పెట్టాలి.’ (1కొ 16:2) మనం ఆ సలహాను పాటిస్తే సత్యారాధనకు మద్దతిస్తాం, సంతోషంగా ఉంటాం. మనం ఇచ్చే విరాళాలు చిన్నవే కావచ్చు. అయితే, యెహోవా మనం ఇచ్చే విరాళాల్ని కాదుగానీ, మన దగ్గరున్న వాటితో ఎంతగా ఆయన్ని ఘనపర్చాలనుకుంటున్నామో దాన్నే విలువైనదిగా చూస్తాడు.—సామె 3:9.
కొంత తీసి పక్కకు పెట్టినందుకు థ్యాంక్యూ అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
ముందే ప్రణాళిక వేసుకుని విరాళాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?
-
కొందరు ఎలా ముందే ‘కొంత తీసి పక్కకు పెట్టారు’?