కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డిసెంబరు 23-29

కీర్తన 119:121-176

డిసెంబరు 23-29

పాట 31, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. లేనిపోని బాధలు కొనితెచ్చుకోకుండా ఎలా ఉండవచ్చు?

(10 నిమి.)

దేవుని ఆజ్ఞల్ని ప్రేమించాలి (కీర్త 119:127; w18.06 17వ పేజీ, 5-6 పేరాలు)

చెడ్డ పనులను ద్వేషించాలి (కీర్త 119:128; wtsbr 4/15 33వ పేజీ, 12వ పేరా)

యెహోవా మాట వినాలి, “అనుభవంలేని” వాళ్లలా తప్పులు చేయకుండా ఉండాలి (కీర్త 119:130,133; సామె 22:3)

ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవుని ఆజ్ఞల్ని ప్రేమించడానికి, చెడ్డ పనుల్ని ద్వేషించడానికి నేను ఇంకా ఏ మార్పులు చేసుకోవాలి?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 119:160—ఈ వచనం ప్రకారం, మనం ఏం నమ్ముతాం? (w23.01 2వ పేజీ, 2వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు భాగంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd 1వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లి కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. తనకు నచ్చిన విషయాల్ని jw.orgలో ఎలా వెతకవచ్చో ఇంటివ్యక్తికి చూపించండి. (lmd 8వ పాఠంలో 3వ పాయింట్‌)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

(5 నిమి.) క్రమంగా మీటింగ్స్‌కి రాని బైబిలు విద్యార్థితో మాట్లాడడం. (lmd 12వ పాఠంలో 4వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 121

7. డబ్బు వల్ల అనవసరమైన సమస్యల్లో చిక్కుకోకండి

(15 నిమి.) చర్చ.

డబ్బు వెనక పరుగెత్తేవాళ్లు “ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.” (1తి 6:9, 10) డబ్బు అనే జబ్బు పట్టి, డబ్బే జీవితంగా బ్రతికితే వచ్చే కొన్ని అనవసరమైన సమస్యలు ఇవి . . .

  • యెహోవాకు మంచి స్నేహితులుగా ఉండడం కష్టం.—మత్త 6:24

  • ఎంతున్నా సంతృప్తి అనేది ఉండదు.—ప్రస 5:10

  • అబద్ధాలు, దొంగతనం, మోసం లాంటి తప్పులు చేసే ప్రమాదం ఎక్కువ. (సామె 28:20) ఆ ప్రమాదంలో చిక్కుకుంటే తప్పు చేశామనే బాధతో కుమిలిపోతాం, మనకున్న మంచి పేరు పోగొట్టుకుంటాం, దేవునికి ఇష్టమైనవాళ్లుగా ఉండలేం.

హెబ్రీయులు 13:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్న అడగండి:

  • డబ్బు జబ్బు వల్ల వచ్చే అనవసరమైన సమస్యలకు ఎలా దూరంగా ఉండవచ్చు? అది ఎందుకు ప్రాముఖ్యం?

డబ్బు మీద మోజు లేకపోయినా, దాన్ని తెలివిగా ఖర్చు పెట్టకపోతే లేనిపోని కష్టాల్ని నెత్తినేసికుంటాం.

డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • బడ్జెట్‌ ఎందుకు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి?

  • కొంత డబ్బును పొదుపు చేయడం ఎందుకు మంచిది?

  • అనవసరమైన అప్పులు చేయకపోవడం ఎందుకు తెలివైన పని?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 101, ప్రార్థన