డిసెంబరు 30, 2024–జనవరి 5, 2025
కీర్తనలు 120-126
పాట 144, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. ఏడుస్తూ విత్తారు, సంతోషంతో పంట కోశారు
(10 నిమి.)
సత్యారాధనను తిరిగి మొదలుపెట్టడానికి, బబులోను చెర నుండి విడుదలైన ఇశ్రాయేలీయులు చాలా సంతోషంగా ఉన్నారు (కీర్త 126:1-3)
యూదయకు తిరిగి వచ్చాక వాళ్లు పడాల్సిన కష్టాన్ని తలచుకొని ఏడ్చి ఉంటారు (కీర్త 126:5; w04 6/1 16వ పేజీ, 10వ పేరా)
వాళ్లు పట్టుదలగా పని చేశారు, దీవెనలు పొందారు (కీర్త 126:6; w21.11 24వ పేజీ, 17వ పేరా; w01 7/15 18-19 పేజీలు, 13-14 పేరాలు; పేజీ చిత్రం చూడండి)
దీనిగురించి ఆలోచించండి: హార్‌మెగిద్దోన్ తర్వాత ఈ పాత లోకం నుండి విడుదలైన మనం, అన్నిటినీ తిరిగి కట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సవాళ్లు ఉండవచ్చు? కానీ ఎలాంటి దీవెనలు పొందుతాం?
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
కీర్త 124:2-5—ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడినట్టే దేవుడు మనల్ని కూడా ఒక గుంపుగా కాపాడతాడా? (cl 73వ పేజీ, 15వ పేరా)
-
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 124:1–126:6 (th 5వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. (lmd 3వ పాఠంలో 5వ పాయింట్)
5. మళ్లి కలిసినప్పుడు
(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంతకుముందు కలిసినప్పుడు, బైబిల్ని నమ్మవచ్చా అనే సందేహంలో ఇంటివ్యక్తి ఉన్నాడు. (lmd 9వ పాఠంలో 5వ పాయింట్)
6. శిష్యుల్ని చేసేటప్పుడు
పాట 155
7. దేవుడిచ్చిన మాటల్ని బట్టి సంతోషించండి
(15 నిమి.) చర్చ.
బబులోనులో బందీలుగా ఉన్న ప్రజలకు ఇచ్చిన ప్రతీమాటను, యెహోవా నిలబెట్టుకున్నాడు. ఆయన వాళ్లను విడిపించి, వాళ్లను ఆధ్యాత్మికంగా బాగుచేశాడు. (యెష 33:24) వాళ్లు తమ దేశంలో లేనప్పుడు సింహాలు, అడవి మృగాల సంఖ్య పెరిగిపోయింది. తిరిగొచ్చిన ఇశ్రాయేలీయులు వాటి బారిన పడకుండా యెహోవా వాళ్లను, వాళ్ల పశువుల్ని కాపాడాడు. (యెష 65:25) మళ్లీ సొంతింటి కల నిజమైంది, సొంత ద్రాక్షతోటలు నాటుకుని, వాటి పంటను తిన్నారు. (యెష 65:21) దేవుడు వాళ్ల చేతుల కష్టాన్ని దీవించాడు, వాళ్లు ఎక్కువ కాలం జీవించారు.—యెష 65:22, 23.
సంతోషించండి! శాంతిని తెస్తానని దేవుడు మాటిచ్చాడు—చిన్నభాగం వీడియో చూపించి, ఇలా అడగండి:
-
ఈ ప్రవచనాలు ఇప్పుడు ఎలా నెరవేరుతున్నాయి?
-
కొత్తలోకంలో అవి ఇంకా గొప్పగా ఎలా నెరవేరతాయి?
-
వీటిలో ఏవి నెరవేరడం కోసం మీరు ఆశగా ఎదురుచూస్తున్నారు?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 20వ అధ్యాయంలో 8-12 పేరాలు, 161వ పేజీ బాక్సు