కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 18-24

కీర్తనలు 107-108

నవంబరు 18-24

పాట 7, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు”

(10 నిమి.)

యెహోవా ఇశ్రాయేలీయుల్ని బబులోను నుండి విడిపించినట్టే, మనల్ని కూడా సాతాను లోకం నుండి విడిపించాడు (కీర్త 107:1, 2; కొలొ 1:13, 14)

యెహోవా మీద కృతజ్ఞత ఉండడం వల్ల సంఘంలో ఆయనను స్తుతిస్తాం (కీర్త 107:31, 32; w07 4/15 20వ పేజీ, 2వ పేరా)

యెహోవా ప్రేమతో చేసిన పనుల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయన మీద కృతజ్ఞత పెరుగుతుంది (కీర్త 107:43; w15 1/15 9వ పేజీ, 4వ పేరా)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 108:9—ఇక్కడ మోయాబును దేవుని “కాళ్లు కడుక్కునే పాత్ర” అని ఎందుకు అనుంటారు? (it-2-E 420వ పేజీ, 4వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. (lmd 1వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ఇంటివ్యక్తికి బైబిలు స్టడీ గురించి చెప్పి, బైబిలు స్టడీ కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (lmd 9వ పాఠంలో 3వ పాయింట్‌)

6. ప్రసంగం

(5 నిమి.) ijwyp 90—అంశం: నేను పాజిటివ్‌గా ఎలా ఆలోచించగలను? (th 14వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 46

7. యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పడానికి పాటలు పాడతాం

(15 నిమి.) చర్చ.

ఎర్ర సముద్రం దగ్గర భయంతో బిక్కుబిక్కుమంటున్న ఇశ్రాయేలీయుల్ని, ఐగుప్తీయుల బలమైన సైన్యం నుండి యెహోవా కాపాడాడు. అప్పుడు వాళ్ల మనసు కృతజ్ఞతతో నిండిపోయి పాట తన్నుకొచ్చింది. (నిర్గ 15:1-19) ఈ కొత్త పాటను ముందు పురుషులే మొదలుపెట్టారు. (నిర్గ 15:21) యేసు అలాగే తొలి క్రైస్తవులు కూడా దేవునికి పాటలు పాడారు. (మత్త 26:30; కొలొ 3:16) మన మీటింగ్స్‌లో, సమావేశాల్లో పాటలు పాడుతూ యెహోవా మీద కృతజ్ఞత చూపిస్తాం. ఉదాహరణకు మనం ఇప్పుడే పాడిన “యెహోవా, నీకు కృతజ్ఞతలు” అనే పాట 1966 నుండి పాడుతున్నాం.

కొన్ని సంస్కృతుల్లో, మగవాళ్లు అందరిలో పాటలు పాడడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇంకొందరైతే, వాళ్ల స్వరం అంత వినసొంపుగా ఉండదని అసలు నోరే విప్పరు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోవా ఆరాధనలో పాటలు పాడడం కూడా ఒక భాగమే. మన మనసును తాకే పాటల్ని కూర్చడానికి యెహోవా సంస్థ ఎంతో కష్టపడుతుంది, అలాగే ప్రతీ మీటింగ్‌లో ఏ పాట పాడితే బాగుంటుందో అని కూడా ఆలోచిస్తుంది. పరలోక తండ్రి మీదున్న ప్రేమను, కృతజ్ఞతను చూపించడానికి మనం చేయాల్సిందల్లా సంగీతానికి మన గొంతు కలపడమే.

మన సంస్థ చరిత్రలోని కొన్ని పేజీలు—సంగీతం—ఒక వరం, 2వ భాగం అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • 1944 లో ఏ గుర్తుండిపోయే సంఘటన జరిగింది?

  • రాజ్య గీతాలు పాడడం మీదున్న ఇష్టాన్ని సైబీరియాలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ ఎలా చూపించారు?

  • యెహోవాసాక్షులకు పాటలు పాడడం ఎందుకంత ముఖ్యం?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 73, ప్రార్థన