కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు లోక ప్రభావాలకు దూరంగా ఉండండి

వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు లోక ప్రభావాలకు దూరంగా ఉండండి

వివాహానికి సిద్ధపడుతున్న ఒక క్రైస్తవ జంట ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. సాధారణంగా వాళ్ల సమాజంలో వివాహాలు ఆడంబరంగా చేసుకునే అలవాటు ఉంటే, వాళ్లు కూడా అలాగే వివాహం చేసుకోవాలనే ఒత్తిడి వాళ్లపై ఉండవచ్చు. వాళ్ల శ్రేయస్సు కోరే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వివాహం ఎలా జరిగితే బావుంటుంది అనే విషయంలో కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. పెళ్లి చేసుకునే జంట మంచి మనస్సాక్షితో, తర్వాత బాధపడాల్సిన అవసరం లేకుండా, వాళ్లకు ఎంతో ముఖ్యమైన ఆ రోజు కోసం సిద్ధపడేందుకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

యెహోవాకు ఘనత తెచ్చే వివాహాలు అనే వీడియో చూసి, తర్వాత కిందున్న ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • నిక్‌, జూలియానాకి కిందున్న బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేశాయి?

  • వివాహం చేసుకునే జంట, ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన ఒక క్రైస్తవ సహోదరుణ్ణి ‘విందు నిర్వాహకుడిగా’ ఎందుకు ఎంచుకోవాలి?—యోహా 2:9, 10.

  • నిక్‌, జూలియానా వ్యక్తిగతంగా తమ వివాహానికి ఎందుకు అలాంటి ఎంపికలు చేసుకున్నారు?

  • వివాహం, విందు విషయంలో చివరి నిర్ణయం ఎవరు తీసుకోవాలి?—w06 10/15 25వ పేజీ, 10వ పేరా.