కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 యోహాను 1-13; 3 యోహాను 1-14యూదా 1-25

మనం సత్యంలో నిలిచి ఉండడానికి పోరాడాలి

మనం సత్యంలో నిలిచి ఉండడానికి పోరాడాలి

యూదా 3

యేసు ఇలా హెచ్చరించాడు: “ఇరుకు ద్వారం గుండా వెళ్లడానికి తీవ్రంగా కృషిచేయండి.” (లూకా 13:24) యేసు మాటలకు అర్థం ఏంటంటే, మనం దేవుని ఆమోదం పొందాలంటే తీవ్రంగా కృషి చేయాలి. యేసు తమ్ముడైన యూదా కూడా ‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడండి’ అని రాశాడు. కింద చెప్పిన వాటిని పాటించాలంటే పట్టుదలగా కృషి చేయాలి:

  • లైంగిక పాపాలకు దూరంగా ఉండాలి.—యూదా 6, 7

  • అధికారంలో ఉన్నవాళ్లను గౌరవించాలి.—యూదా 8, 9

  • ‘అత్యంత పవిత్రమైన మన విశ్వాసం’ మీద, క్రైస్తవ బోధల మీద మన నమ్మకాన్ని బలపర్చుకోవాలి.—యూదా 20, 21