మన క్రైస్తవ జీవితం
మనకు ఏం కావాలో యెహోవాకు తెలుసు
నమ్మకమైన బుద్ధిగల దాసుడు మనకు “తగిన సమయంలో” ఆహారం అందిస్తున్నాడు. దీనిబట్టి, దాసుడ్ని నిర్దేశిస్తున్న యెహోవాకు మన ఆధ్యాత్మిక అవసరాల గురించి తెలుసని చెప్పవచ్చు. (మత్త 24:45) మన ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటిలోకి ప్రాదేశిక సమావేశాలు, వారం మధ్యలో జరిగే కూటాలు ఈ విషయాన్ని స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
2017 టీచింగ్ కమిటీ రిపోర్ట్ అనే వీడియో చూసి కిందున్న ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
తగిన సమయంలో మనం సమావేశాలను ఆనందిస్తున్నామంటే, దాని ఘనత ఎవరికి చెందాలి, ఎందుకు?
-
సమావేశానికి సంబంధించిన పని ఎప్పుడు మొదలౌతుంది?
-
సమావేశంలోని అంశాలను ఎలా ఎంచుకుంటారు?
-
సమావేశాలను సిద్ధం చేయడంలో ఏ పని ఇమిడి ఉంది?
-
వారం మధ్యలో జరిగే కూటంలో మనం నేర్చుకునే సమాచారాన్ని తయారుచేసేటప్పుడు గిలియడ్‌లో నేర్పించిన అధ్యయన పద్ధతుల్ని ఎలా ఉపయోగిస్తారు?
-
వేర్వేరు విభాగాలు కలిసి మన మీటింగ్ వర్క్‌బుక్‌ని ఎలా తయారు చేస్తారు?
యెహోవా చేస్తున్న ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటిని బట్టి మీకు ఏమి అనిపిస్తుంది?