కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

సంతోషంగా ఇచ్చేవాళ్లంటే యెహోవాకు ఇష్టం

సంతోషంగా ఇచ్చేవాళ్లంటే యెహోవాకు ఇష్టం

2 కొరింథీయులు 9:7 మనకు ఇలా చెప్తుంది: “ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.” స్థానికంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు చేసే పని కోసం మద్దతుగా ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వవచ్చు. అందుకు, నేడు ఎన్నో సులభమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

ఎలక్ట్రానిక్‌ రూపంలో విరాళాలు ఎలా ఇవ్వాలో తెలుసుకోండి అనే వీడియో చూసి కిందున్న ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • విరాళాలు ఇచ్చేందుకు మన దేశంలో ఏయే పద్ధతులు అందుబాటులో ఉన్నాయో తెలియజేసే పేజీని మనం ఎలా చూడొచ్చు?

  • ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వడం ద్వారా కొంతమంది ఎలా ప్రయోజనం పొందారు?

  • విరాళాలు ఇచ్చే కొన్ని పద్ధతులు ఏంటి?

  • కొత్త ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఎలా ఉపయోగించాలో తెలియకపోతే మనం ఏం చేయవచ్చు?