కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లేవీయకాండం 8-9

యెహోవా దీవెనకు రుజువు

యెహోవా దీవెనకు రుజువు

8:6-9, 12; 9:1-5; 23, 24

అహరోను, అతని కుమారులు యాజకులైన తర్వాత అర్పించిన మొదటి దహనబలుల్ని దహించడానికి యెహోవా అగ్నిని పంపించాడు. ఈ యాజకత్వ ఏర్పాటుకు యెహోవా మద్దతు, ఆమోదం ఉన్నాయని అది స్పష్టం చేసింది. అగ్నిని పంపించడం ద్వారా, అక్కడ సమావేశమై జరుగుతున్నదాన్ని చూస్తున్న ఇశ్రాయేలీయులందరూ, యాజకులకు పూర్తి మద్దతు ఇవ్వాలని యెహోవా తెలియజేశాడు. నేడు యెహోవా, మహిమాన్వితుడైన యేసుక్రీస్తును గొప్ప ప్రధానయాజకునిగా ఉపయోగించుకుంటున్నాడు. (హెబ్రీ 9:11, 12) 1919⁠లో, కొంతమంది అభిషిక్తుల చిన్నగుంపును ‘నమ్మకమైన, బుద్ధిగల దాసునిగా’ యేసు నియమించాడు. (మత్త 24:45) ఈ నమ్మకమైన దాసునికి యెహోవా ఆశీర్వాదం, మద్దతు, ఆమోదం ఉన్నాయని చెప్పడానికి ఏ రుజువులు ఉన్నాయి?

  • హింస ఎదురౌతూనే ఉన్నా, నమ్మకమైన దాసుడు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎల్లప్పుడూ అందిస్తూనే ఉన్నాడు

  • ముందే చెప్పినట్టుగా, రాజ్య సువార్త “భూమంతటా” ప్రకటించబడుతోంది.—మత్త 24:14

నమ్మకమైన, బుద్ధిగల దాసునికి మనం పూర్తి మద్దతును ఎలా ఇవ్వవచ్చు?