అర్పణల ఉద్దేశం
ధర్మశాస్త్ర ఒప్పందం ప్రకారం అర్పించిన అర్పణలు లేదా బలులు యెహోవాను సంతోషపెట్టాయి. అంతేకాదు, అవి యేసు అర్పించిన విమోచన క్రయధనానికి లేదా దానివల్ల వచ్చే ప్రయోజనాలకు సూచనగా ఉండేవి.—హెబ్రీ 8:3-5; 9:9; 10:5-10.
-
ఎలాంటి లోపం లేదా దోషం లేని జంతువులనే బలిగా అర్పించినట్టు; యేసు కూడా తన పరిపూర్ణమైన, ఎలాంటి లోపంలేని శరీరాన్ని బలిగా అర్పించాడు.—1పే 1:18, 19
-
దహనబలిగా అర్పించే అర్పణల్ని దేవునికి పూర్తిగా అర్పించినట్టే; యేసు కూడా తనను తాను యెహోవాకు పూర్తిగా అర్పించుకున్నాడు
-
ఆమోదయోగ్యమైన సమాధానబలిని అర్పించినవాళ్లు దేవునితో శాంతియుత సంబంధం కలిగివున్నట్టే; ప్రభువు రాత్రి భోజనంలో భాగం వహించే అభిషిక్తులు దేవునితో శాంతియుత సంబంధం కలిగివుంటారు