కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | ప్రస౦గి 7-12

“నీ బాల్యదినముల౦దే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము”

“నీ బాల్యదినముల౦దే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము”

యవన౦లో ఉన్నప్పుడే మీ సామర్థ్యాలను దేవుని సేవకోస౦ ఉపయోగిస్తూ మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో౦డి

12:1, 13

  • కొత్తగా, కష్ట౦గా ఉ౦డే నియామకాలను చేయడానికి కావాల్సిన ఆరోగ్య౦, బల౦ చాలామ౦ది యవనులకు ఉ౦టు౦ది

  • ముసలితన౦ వచ్చి శక్తి తగ్గిపోకము౦దే, యవనులు తమ సమయాన్ని, శక్తిని దేవుని సేవలో ఉపయోగి౦చాలి

ముసలితన౦లో వచ్చే సమస్యలను సొలొమోను పద్య రూప౦లో వివరి౦చాడు

12:2-7

  • 3వ వచన౦: “కిటికీలలోగు౦డ చూచువారు కానలేకయు౦దురు”

    చూపు తగ్గుతు౦ది

  • 4వ వచన౦: “స౦గీతమును చేయు స్త్రీలు, నాదము చేయువార౦దరును నిశ్శబ్దముగా ఉ౦చబడుదురు”

    వినికిడి తగ్గుతు౦ది

  • 5వ వచన౦: “బుడ్డబుడుసరకాయ పగులును”

    ఆకలి తగ్గిపోతు౦ది