యెషయా 58-62
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద |“యెహోవా హితవత్సరమును” ప్రకటి౦చుము
‘యెహోవా హితవత్సర౦’ ఒక నిజమైన స౦వత్సర౦ కాదు
61:1, 2
-
అది ఒక కాల౦. ఆ కాల౦లో యెహోవా దీనులైన వారికి తను ప్రకటి౦చే స్వేచ్ఛకు ప్రతిస్ప౦ది౦చే అవకాశాన్ని ఇస్తాడు
-
ఈ హితవత్సర౦ మొదటి శతాబ్ద౦లో యేసు పరిచర్యను మొదలుపెట్టిన క్రీ.శ. 29వ స౦వత్సర౦తో మొదలై౦ది. క్రీ.శ. 70లో యెహోవా “ప్రతిద౦డన దినము” వచ్చి యెరూషలేము నాశన౦ అయినప్పుడు ఆ కాల౦ ముగిసి౦ది
-
ఆ హితవత్సర౦ మన రోజుల్లో, 1914లో యేసు పరలోక౦లో రాజైనప్పుడు మొదలై౦ది, మహాశ్రమలతో ముగుస్తు౦ది
యెహోవా ‘నీతి అను మస్తకివృక్షములతో’ ఆయన ప్రజలను ఆశీర్వదిస్తాడు
61:3, 4
-
ప్రప౦చ౦లో పెద్దపెద్ద చెట్లు అడవుల్లో కలిసి పెరుగుతాయి, అవన్నీ ఒకదానికి ఒకటి సహాయ౦గా ఉ౦టాయి
-
పెద్దపెద్ద వేర్లు ఒకదానికొకటి పెనవేసుకున్నప్పుడు, చెట్లు బల౦గా పాతుకుపోయి తుఫానులను తట్టుకు౦టాయి
-
పొడవైన చెట్లు చిన్నచిన్న చెట్లకు, పిలకలకు కావాల్సిన నీడను ఇస్తూ కాపాడతాయి. చెట్ల ను౦డి రాలిన ఆకులు మట్టిలో సారాన్ని పె౦చుతాయి
‘నీతి అను మస్తకివృక్షములుగా’ ఉన్న అభిషిక్త శేష౦ ఇచ్చే మద్దతు, రక్షణ వల్ల ప్రప౦చవ్యాప్త౦గా ఉన్న క్రైస్తవ స౦ఘ౦లో సభ్యులు ప్రయోజన౦ పొ౦దుతారు