కంబోడియాలో సత్యాన్ని బోధిస్తున్నారు

జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్‌ ఫిబ్రవరి 2018

ఇలా మాట్లాడవచ్చు

మాట్లాడడానికి సహాయం చేసే ప్రశ్నలు: బైబిలు ఈ కాలానికి ఉపయోగపడుతుందా? సైన్స్‌తో సరిపోతుందా? దానిలో ఉన్న సలహాలు ఉపయోగపడతాయా?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

గోధుమలు, గురుగులు గురించిన ఉపమానం

ఈ ఉపమానం ద్వారా యేసు ఏమి వివరిస్తున్నాడు? విత్తేవానికి, శత్రువుకి, కోత కోసేవాళ్లకు గుర్తుగా ఎవరు ఉన్నారు?

మన క్రైస్తవ జీవితం

రాజ్యం గురించిన ఉపమానాలు, మనకు నేర్పే పాఠాలు

యేసు సులువైన ఉపమానాలతో లోతైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించాడు. మత్తయి 13వ అధ్యాయం నుండి మనం ఏ పాఠాలను నేర్చుకోవచ్చు?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ

యేసు శిష్యుల దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలే ఉన్నా యేసు వేలమందికి ఆహారం పెట్టమని తన శిష్యులకు చెప్పాడు. ఏమి జరిగింది? దాని నుండి మనం ఏమి తెలుసుకోవచ్చు?

మన క్రైస్తవ జీవితం

మీ అమ్మానాన్నల్ని గౌరవించండి

యేసు భూమ్మీద జీవించినప్పుడు పదేపదే ఈ ఆజ్ఞ గురించి చెప్పాడు “మీ అమ్మానాన్నల్ని గౌరవించు.” ఈ ఆజ్ఞకు కాల పరిమితి ఉందా?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీరు ఎవరిలా ఆలోచిస్తున్నారు?

సాతాను ఇష్టప్రకారం కాకుండా దేవుని ఇష్టప్రకారం నిర్దేశించబడాలంటే మనం ఏమి చేయాలి? మనం తప్పుగా ఆలోచించకుండా సహాయం చేసే మూడు విషయాలను యేసు చెప్పాడు.

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సమర్థవంతంగా ప్రశ్నలు అడగడం

యేసు ప్రజలకు వేర్వేరు పాఠాలు నేర్పించడానికి సమర్థవంతంగా ప్రశ్నలు అడిగాడు. మనం పరిచర్యలో ఆయన నైపుణ్యవంతమైన విధానాన్ని ఎలా ఉపయోగించగలం?

దేవుని వాక్యంలో ఉన్న సంపద

మీరు గానీ ఇతరులు గానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి

ఇతరులు పాపం చేసేలా చేసినా లేదా మనం పాపం చేసినా ఎంత ప్రమాదమో నేర్పించడానికి యేసు ఉపమానాలను ఉపయోగించాడు. మీరు పాపం చేసేలా లేదా విశ్వాసం కోల్పోయేలా మీ జీవితంలో ఏది కారణం కాగలదు?