కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 14-15

కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ

కొద్దిమంది చేతుల మీదుగా ఎంతోమందికి పోషణ

క్రీస్తు శకం 32లో పస్కాకు కొన్నిరోజుల ముందు యేసు ఒక అద్భుతాన్ని చేశాడు. సువార్త రచయితలు నలుగురూ నమోదు చేసిన అద్భుతం ఇదొక్కటే.

ఈ అద్భుతం ద్వారా యేసు ఒక పద్ధతిని మొదలుపెట్టి చూపించాడు. మన కాలంలో కూడా ఇంకా ఆయన ఆ పద్ధతిని పాటిస్తున్నాడు.

14:16-21

  • వాళ్ల దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలే ఉన్నా యేసు ప్రజలకు ఆహారం పెట్టమని తన శిష్యులకు చెప్పాడు

  • యేసు రొట్టెలను, చేపలను తీసుకుని ప్రార్థించిన తర్వాత తన శిష్యులకు పంచి ఇచ్చాడు. వాళ్లు వాటిని ఆ సమూహానికి పంచి పెట్టారు

  • అద్భుతంగా, ప్రతీ ఒక్కరు తినడానికి ఆహారం చాలా ఎక్కువగా ఉంది. యేసు కొంతమంది చేతుల మీదుగా అంటే తన శిష్యుల ద్వారా వేలమందికి ఆహారం పెట్టాడు

  • “తగిన సమయంలో” ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి యేసు చివరి రోజుల్లో కొంతమందిని నియమిస్తానని ముందుగానే చెప్పాడు.—మత్త 24:45

  • 1919లో యేసు ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుడిని’ నియమించాడు. “తన ఇంట్లోని సేవకులకు” ఆహారం పెట్టడానికి యేసు నియమించిన ఈ అభిషక్త సహోదరుల చిన్న గుంపే “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు”

  • ఈ అభిషక్త సహోదరుల చిన్న గుంపును ఉపయోగిస్తూ యేసు మొదటి శతాబ్దంలో మొదలుపెట్టి చూపించిన పద్ధతిని ఇంకా పాటిస్తున్నాడు

ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి యేసు ఉపయోగించే మార్గాన్ని గుర్తించి, గౌరవిస్తున్నానని నేను ఎలా చూపించవచ్చు?