కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సమర్థవంతంగా ప్రశ్నలు అడగడం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సమర్థవంతంగా ప్రశ్నలు అడగడం

ఎందుకు ప్రాముఖ్యం?: “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది.” దాన్ని బయటకు తోడడానికి ప్రశ్నలు నీళ్లు తోడే బకెట్‌లా ఉపయోగపడతాయి. (సామె 20:5) వినేవాళ్లు బాగా ఆలోచించడానికి, చర్చలో పాల్గొనడానికి ప్రశ్నలు ఉపయోగపడతాయి. ప్రశ్నలు సమర్థవంతంగా అడగడం ద్వారా జవాబుతోపాటు వాళ్ల ప్రతిస్పందన కూడా తెలుస్తుంది. యేసు ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించాడు. మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు?

ఎలా చేయవచ్చు:

  • అభిప్రాయాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు వేయండి. శిష్యుల అభిప్రాయం తెలుసుకోవడానికి యేసు వరుసగా ప్రశ్నలు అడిగాడు. (మత్త 16:13-16; be 238వ పేజీ, 3-5 పేరాలు) ఇంటివాళ్ల అభిప్రాయాన్ని తెలుసుకునేలా మీరు ఏ ప్రశ్నలు అడగవచ్చు?

  • జవాబు తెలుసుకోవడానికి సహాయం చేసే ప్రశ్నలు. యేసు పేతురు ఆలోచనను సరిచేయడానికి ప్రశ్నలు అడిగాడు, తగిన జవాబులను చూపించి సరైన అభిప్రాయానికి వచ్చేలా పేతురుకు సహాయం చేశాడు. (మత్త 17:24-26) సరైన అభిప్రాయానికి వచ్చేలా సహాయం చేయడానికి మీరు ఎవరినైనా ఏ ప్రశ్నలు అడగవచ్చు?

  • మెచ్చుకోండి. ఒక శాస్త్రి “తెలివిగా జవాబిచ్చాడని” యేసు అతన్ని మెచ్చుకున్నాడు. (మార్కు 12:34) ఎవరైనా ప్రశ్నకు సరైన జవాబును చెప్పినప్పుడు మీరు ఎలా మెచ్చుకోవచ్చు?

యేసు చేసిన పనే మీరూ చేయండి—బోధించండి మొదటి భాగం చూసిన తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • చెప్తున్న సమాచారం కరెక్టే అయినా ఇది బోధించడానికి ఎందుకు మంచి పద్ధతి కాదు?

  • మనం కేవలం సమాచారాన్ని వివరించడం కన్నా ఎక్కువే ఎందుకు చేయాలి?

ఈ వీడియోలో రెండవ భాగం చూసి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • సహోదరుడు ప్రశ్నలు ఎలా సమర్థవంతంగా అడిగాడు?

  • మనం అతని బోధనా విధానంలో ఏ ఇతర విషయాలు అనుకరించవచ్చు?

మనం నేర్పించే విషయాలు ఇతరుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? (లూకా 24:32)