కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 18-19

మీరు గానీ ఇతరులు గానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి

మీరు గానీ ఇతరులు గానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి

ఇతరులు పాపం చేసేలా చేసినా లేదా మనం పాపం చేసినా ఎంత ప్రమాదమో నేర్పించడానికి​ యేసు ఉపమానాలను ఉపయోగించాడు.

18:6, 7

  • పాపం చేసేలా లేదా విశ్వాసం కోల్పోయేలా చేయడం అంటే, ఏదైనా పని లేదా పరిస్థితి ద్వారా తప్పుడు దారిలోకి వెళ్లేలా చేయడం, ప్రవర్తన విషయంలో దిగజారిపోయేలా లేదా పడిపోయేలా చేయడం, లేదా పాపంలో పడిపోయేలా చేయడం

  • ఒకతను ఇతరులు పాపం చేయడానికి కారణం అవ్వడం కన్నా అతని మెడకి తిరుగలి రాయి కట్టి సముద్రంలో పడేయడమే అతనికి మంచిది

తిరుగలి రాళ్లు

18:8, 9

  • చెయ్యి, కన్ను లాంటి విలువైన అవయవాలు విశ్వాసం నుండి పడిపోయేలా చేస్తుంటే, వాటిని తీసేసుకోవాలని యేసు తన అనుచరులకు చెప్పాడు

  • అంత విలువైన అవయవాలతో పాటు గెహెన్నాలో (పూర్తి నాశనానికి గుర్తు) పడడం కన్నా వాటిని వదులుకుని దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం మంచిది

నేను పాపం చేసేలా లేదా విశ్వాసం కోల్పోయేలా నా జీవితంలో ఏది కారణం కాగలదు, నేను గానీ ఇతరులు గానీ విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకుండా నేను ఎలా జాగ్రత్త పడాలి?