కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 12-13

గోధుమలు, గురుగులు గురించిన ఉపమానం

గోధుమలు, గురుగులు గురించిన ఉపమానం

క్రీ.శ. 33 మొదలుకొని, గోధుమల తరగతికి చెందిన అభిషిక్త క్రైస్తవులందర్నీ మానవజాతి నుండి ఎలా తీసుకువెళ్తాడో, ఎప్పుడు తీసుకువెళ్తాడో వివరించడానికి యేసు గోధుమలు, గురుగులు గురించిన ఉపమానాన్ని ఉపయోగించాడు.

13:24

తన పొలంలో ఒక మనిషి మంచి విత్తనాలు నాటాడు

  • విత్తిన మనిషి: యేసుక్రీస్తు

  • మంచి విత్తనాలు నాటడం: యేసు శిష్యులు పవిత్రశక్తి చేత అభిషేకించబడ్డారు

  • పొలం: ప్రపంచ మానవజాతి

13:25

“అందరూ నిద్రపోతున్నప్పుడు అతని శత్రువు వచ్చి, గోధుమల మధ్య గురుగుల్ని నాటి వెళ్లిపోయాడు”

  • శత్రువు: అపవాది

  • అందరూ నిద్రపోతున్నప్పుడు: అపొస్తలులు చనిపోయాక

13:30

“కోతకాలం వరకు రెండిటినీ కలిసి పెరగనివ్వండి”

  • గోధుమలు: అభిషిక్త క్రైస్తవులు

  • గురుగులు: నకిలీ క్రైస్తవులు

‘ముందు గురుగుల్ని పీకేసి తర్వాత గోధుమల్ని సమకూర్చండి’

  • దాసులు/కోత కోసేవాళ్లు: దేవదూతలు

  • గురుగులు పీకడం: నకిలీ క్రైస్తవులు, అభిషిక్త క్రైస్తవుల నుండి వేరుచేయబడ్డారు

  • గోదాములోకి సమకూర్చడం: అభిషిక్త క్రైస్తవులు తిరిగి సంఘంగా సమకూర్చబడ్డారు

కోతకాలం మొదలైనప్పుడు నిజ క్రైస్తవుల్ని, నకిలీ క్రైస్తవుల నుండి వేరు చేసింది ఏమిటి?

ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా నేను వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందుతాను?