కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండండి

ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉండండి

దేవుని రాజ్యం రావాలని మీరు ఎంతకాలం నుండి ఎదురుచూస్తున్నారు? కష్టాలు వచ్చినా మీరు ఓపికతో సహిస్తున్నారా? (రోమా 8:25) కొంతమంది క్రైస్తవులు ద్వేషాన్ని, అవమానాన్ని-హింసను ఎదుర్కొన్నారు; ఇంకొంతమందిని జైల్లో వేశారు, చంపేస్తామని బెదిరించారు. చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, వయసు పైబడడం వల్ల వచ్చే సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఎలాంటి కష్టం వచ్చినా, ఆశతో ఎదురుచూడడానికి ఏది సహాయం చేస్తుంది? మనం ప్రతీరోజు బైబిలు చదువుతూ, చదివినవాటిని ధ్యానిస్తూ మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలి. నిరీక్షణ మీదే మనసుపెట్టాలి. (2 కొరిం 4:16-18; హెబ్రీ 12:2) పట్టుదలతో యెహోవాకు ప్రార్థిస్తూ తన పవిత్రశక్తిని ఇవ్వమని వేడుకోవాలి. (లూకా 11:10, 13; హెబ్రీ 5:7) “ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేలా” మన ప్రేమగల తండ్రి మనకు సహాయం చేయగలడు.—కొలొ 1:11.

‘ఓపిగ్గా పరుగెత్తండి’—బహుమానం పొందుతారనే నమ్మకంతో అనే వీడియో చూసి, కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • జీవితంలో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగవచ్చు? (ప్రసం 9:11)

  • కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?

  • మనం యెహోవా సేవను ఒకప్పుడు చేసినంతగా చేయలేకపోతుంటే, ఇప్పుడు చేయగలిగే దానిమీదే మనసుపెట్టడం ఎందుకు మంచిది?

  • మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి

    బహుమతి పొందుతామనే నమ్మకంతో ఉండడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?