కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​​—⁠ప్రగతి సాధించని బైబిలు అధ్యయనాలు ఆపేయడం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​​—⁠ప్రగతి సాధించని బైబిలు అధ్యయనాలు ఆపేయడం

ఎందుకు ప్రాముఖ్యం? యెహోవా పేరున ప్రార్థిస్తేనే ప్రజలు రక్షించబడతారు. (రోమా 10:13, 14) అయితే, బైబిలు అధ్యయనానికి ఒప్పుకునే వాళ్లందరూ యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించాలని కోరుకోకపోవచ్చు. కాబట్టి, యెహోవాను సంతోషపెట్టేలా మార్పులు చేసుకోవాలని నిజంగా కోరుకునేవాళ్లకు సహాయం చేసినప్పుడు, పరిచర్యలో మన సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగిస్తాం. తగినంత సమయం గడిచినా ఒక బైబిలు విద్యార్థి సరిగ్గా ప్రగతి సాధించకపోతుంటే, అతనితో అధ్యయనం ఆపేసి యెహోవా తన వైపుకు, తన సంస్థ వైపుకు ఆకర్షిస్తున్న ఇతరులకు సహాయం చేయడం తెలివైన పని. (యోహా 6:44) అయితే, కొంతకాలం తర్వాత అతను మార్పులు చేసుకుని, “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి” తనకు ఉందని చూపిస్తే, తిరిగి సంతోషంగా ఆ అధ్యయనాన్ని కొనసాగిస్తాం.—అపొ 13:48.

ఎలా చేయాలి?

  • సరైన జ్ఞానం సంపాదించాలని కోరుకుంటున్నందుకు విద్యార్థిని మెచ్చుకోండి.—1 తిమో 2:4

  • నేర్చుకున్నవాటిని పాటించడం ప్రాముఖ్యమని నొక్కిచెప్పండి.—లూకా 6:46-49

  • యేసు చెప్పిన విత్తేవాడి ఉదాహరణను దయగా చర్చించి, ప్రగతి సాధించకుండా ఏది తనను అడ్డుకుంటుందో ఆలోచించమనండి.—మత్త 13:18-23

  • మీరు అధ్యయనం ఎందుకు ఆపేస్తున్నారో నొప్పించకుండా చెప్పండి

  • అతన్ని ప్రోత్సహించడం కోసం మీరు అప్పుడప్పుడు కలుస్తారని, అతను ప్రగతి సాధిస్తే మళ్లీ అధ్యయనం కొనసాగుతుందని తెలియజేయండి

వీడియో చూసి, కిందున్న ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • విద్యార్థి ప్రగతి సాధించట్లేదని సూచించే ఏ విషయాలు మీరు సంభాషణలో గమనించారు?

  • అతను మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవడానికి ప్రచారకుడు ఎలా సహాయం చేశాడు?

  • ముందుముందు మళ్లీ అధ్యయనం కొనసాగే అవకాశముందని ప్రచారకుడు ఎలా తెలియజేశాడు?