కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?

దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?

రంగురంగుల పువ్వుల్ని, నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని, పెద్దపెద్ద జలపాతాల్ని చూసినప్పుడు, అవి దేవుని చేతి పనులని మీరు అర్థంచేసుకుంటున్నారా? మన చుట్టూ ఉన్న సృష్టి దేవుని అదృశ్య లక్షణాల్ని స్పష్టంగా తెలియజేస్తుంది. (రోమా 1:20) మనం కళ్లతో చూసేవాటి గురించి కాసేపు ఆగి ఆలోచించినప్పుడు దేవునికున్న శక్తి, ప్రేమ, తెలివి, న్యాయం, ఔదార్యం వంటి లక్షణాల్ని చూడగలుగుతాం.—కీర్త 104:24.

దేవుని సృష్టి కార్యాల్లో మీరు ప్రతీరోజు ఏవేవి చూస్తున్నారు? మీరు నగరంలో జీవిస్తున్నాసరే పక్షుల్ని, చెట్లను చూడొచ్చు. దేవుని సృష్టిని జాగ్రత్తగా గమనించడం వల్ల మన ఆందోళన తగ్గుతుంది, సమస్యల మీద కాకుండా అత్యంత ప్రాముఖ్యమైన వాటి మీద దృష్టిపెడతాం, మనల్ని నిరంతరం చూసుకోగల యెహోవా సామర్థ్యం మీద విశ్వాసం పెరుగుతుంది. (మత్త 6:25-32) మీకు పిల్లలు ఉంటే, యెహోవా సాటిలేని లక్షణాల్ని అర్థంచేసుకోవడానికి వాళ్లకు సహాయం చేయండి. మన చుట్టూ ఉన్న సృష్టి పట్ల కృతజ్ఞత పెరిగేకొద్ది మనం సృష్టికర్తకు ఇంకా దగ్గరౌతాం.—కీర్త 8:3, 4.

సృష్టిలోని అద్భుతాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి—వెలుగు, రంగులు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • రంగుల్ని చూడడానికి వర్ణకాలు (పిగ్‌మెంట్లు) ఎలా సహాయం చేస్తాయి?

  • వర్ణదీప్తి (ఇరిడిసెన్స్‌) ప్రక్రియకు కారణం ఏమిటి?

  • ఆకాశంలో వేర్వేరు రంగులు ఎందుకు కనిపిస్తాయి?

  • సృష్టిలోని ఎలాంటి అద్భుతమైన రంగుల్ని మీ ఇంటి దగ్గర చూశారు?

  • ప్రకృతిని శ్రద్ధగా గమనించడానికి ఎందుకు సమయం తీసుకోవాలి?

యెహోవా లక్షణాల గురించి వెలుగు, రంగులు ఏమి తెలియజేస్తున్నాయి?