కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి

మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి

మోయాబు మైదానాల్లో ఇశ్రాయేలీయులకు ఎదురైన సంఘటన నేడున్న క్రైస్తవులకు హెచ్చరికగా ఉంది. (1కొ 10:6, 8, 11) మోయాబు స్త్రీలు లైంగిక పాపాలు, విగ్రహారాధన చేసేవాళ్లు; వాళ్లతో స్నేహం చేయడం వల్ల ఇశ్రాయేలీయులు ఘోరమైన పాపాలకు పాల్పడ్డారు. దానివల్ల తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కొన్నారు. (సం 25:9) నేడు మన చుట్టూ ఉన్న తోటి ఉద్యోగులు, తోటి విద్యార్థులు, ఇరుగుపొరుగువాళ్లు, బంధువులు, ఇతరులు యెహోవాను ఆరాధించనివాళ్లే. అలాంటి వాళ్లతో స్నేహం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చని ఈ బైబిలు ఉదాహరణ తెలియజేస్తుంది?

హెచ్చరికా ఉదాహరణలు—మనకు నేర్పించే పాఠాలు—చిన్నభాగం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • యామీను ఆలోచనల్ని పాడుచేయడానికి జిమ్రీ, ఇతరులు ఎలా ప్రయత్నించారు?

  • యామీను విషయాల్ని సరైన దృష్టితో చూసేలా ఫీనెహాసు ఎలా సహాయం చేశాడు?

  • యెహోవాను ఆరాధించనివాళ్లతో సన్నిహితంగా ఉండడానికి, వాళ్లతో స్నేహం చేయడానికి మధ్య తేడా ఏంటి?

  • మనం సంఘంలో స్నేహితులను ఎంచుకునేటప్పుడు కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

  • పరిచయం లేనివాళ్లు మొదలుపెట్టిన చాట్‌ గ్రూపుల్లో మనం ఎందుకు జాయిన్‌ అవ్వకూడదు?