కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పేతురు, యోహానులు సా.శ. 33 పస్కా కోసం మేడగదిని సిద్ధం చేస్తున్నారు

మన క్రైస్తవ జీవితం

మీరు జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతున్నారా?

మీరు జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతున్నారా?

యేసు ఆచరించే చివరి పస్కా భోజనం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే ఆయన త్వరలో చనిపోతాడు, తన అపొస్తలులతో కలిసి చివరిసారిగా పస్కా భోజనం చేసి, ఒక కొత్త వార్షిక ఆచరణను అంటే ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించాలని ఆయన అనుకుంటున్నాడు. దానికోసం గదిని సిద్ధం చేయమని పేతురు, యోహానులను పంపించాడు. (లూకా 22:7-13; ముఖచిత్రం చూడండి.) దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? మార్చి 27న జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు మనం సిద్ధపడాలని ఇది తెలియజేస్తుంది. ఆ రోజు ప్రసంగాన్ని ఎవరు ఇవ్వాలి, చిహ్నాలను ఎవరు తయారుచేయాలి వంటివి సంఘాలు ఇప్పటికే నిర్ణయించి ఉంటాయి. అయితే, మనం వ్యక్తిగతంగా జ్ఞాపకార్థ ఆచరణకు ఎలా సిద్ధపడవచ్చు?

యేసు మరణం పట్ల మీ కృతజ్ఞత పెంచుకోండి. జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనంలో ఇచ్చిన వచనాల్ని చదివి, ధ్యానించండి. మీరు వాటిని ప్రతీరోజు లేఖనాల్ని పరిశోధిద్దాం పుస్తకంలో చూడవచ్చు. మరిన్ని వివరాలు ఉన్న షెడ్యూల్‌ కోసం కొత్త లోక అనువాదంలో అనుబంధం B12 చూడవచ్చు. (ఏప్రిల్‌ 2020 మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ వర్క్‌బుక్‌ కూడా చూడండి.) అంతేకాదు, విమోచన క్రయధనం ప్రాముఖ్యతను మన కుటుంబ ఆరాధనలో చర్చించుకోవచ్చు. అందుకు కావాల్సిన సమాచారాన్ని వాచ్‌టవర్‌ పబ్లికేషన్‌ ఇండెక్స్‌ లేదా యెహోవాసాక్షుల పరిశోధన పుస్తకంలో కనుగొనవచ్చు.

ఇతరుల్ని ఆహ్వానించండి. ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనండి. మీ రిటన్‌ విజిట్‌ వాళ్లను, పాత బైబిలు విద్యార్థులను, స్నేహితులను, బంధువులను ఇలా ఎవరెవర్ని ఆహ్వానించవచ్చో ఆలోచించండి. నిష్క్రియులను ఈ కూటానికి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేయడం సంఘపెద్దలు మర్చిపోకూడదు. మీరు ఆహ్వానించేవాళ్లు ఎవరైనా వేరే ప్రాంతంలో ఉంటే, వాళ్లకు దగ్గర్లో జ్ఞాపకార్థ ఆచరణ జరిగే సమయం, స్థలం తెలుసుకోవడానికి jw.org హోమ్‌ పేజీ పైభాగంలో మా గురించి క్లిక్‌ చేసి, జ్ఞాపకార్థ ఆచరణ చూడండి.

జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడడానికి మనం ఇంకా ఏం చేయవచ్చు?