చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి
ప్రశ్నలు వేయడం
మనం పరిచర్యను ఆనందించాలని ‘సంతోషంగల దేవుడైన’ యెహోవా కోరుకుంటున్నాడు. (1తి 1:11) మన నైపుణ్యాలు పెంచుకోవడానికి కృషిచేసే కొద్దీ మన సంతోషం పెరుగుతూ ఉంటుంది. ప్రశ్నలు ఆసక్తిని పెంచుతాయి, సంభాషణ ప్రారంభించడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు అవి ప్రజలను ఆలోచింపజేస్తాయి, వాళ్లు సరైన ముగింపుకు వచ్చేలా చేస్తాయి. (మత్త 22:41-45) మనం ఒక వ్యక్తిని ప్రశ్నలు అడిగినప్పుడు, అతను చెప్పేది విన్నప్పుడు, ‘నువ్వు నాకు ముఖ్యమైన వ్యక్తివి’ అని చూపిస్తాం. (యాకో 1:19) సంభాషణను ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం చేసుకోవడానికి వాళ్లు ఇచ్చే జవాబులు సహాయం చేస్తాయి.
శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—ప్రశ్నలు వేయడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
-
జాస్మిన్‌లో ఏ మంచి లక్షణాలు ఉన్నాయి?
-
వ్యక్తిగత శ్రద్ధ చూపించడానికి నీతా ఏ ప్రశ్న వేసింది?
-
మంచివార్త పట్ల జాస్మిన్‌కున్న ఆసక్తిని పెంచడానికి నీతా ఏ ప్రశ్నలు వేసింది?
-
జాస్మిన్ సరైన ముగింపుకు వచ్చేలా సహాయం చేయడానికి నీతా ఏ ప్రశ్న వేసింది?