కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీరు ఆన్‌లైన్‌లో ఎవరితో స్నేహం చేస్తున్నారు

మీరు ఆన్‌లైన్‌లో ఎవరితో స్నేహం చేస్తున్నారు

ఒకరి మీద ఒకరు ప్రేమాగౌరవాలు చూపించుకుంటూ కలిసి ఉండే వ్యక్తుల్ని స్నేహితులు అంటారు. ఉదాహరణకు దావీదు గొల్యాతును చంపాక, దావీదు యోనాతానుల మధ్య స్నేహం చిగురించి, అది ఎవరూ విడదీయలేనంత బలంగా మారింది. (1స 18:1) వాళ్లలో ఉన్న లక్షణాలే వాళ్లిద్దర్నీ దగ్గర చేశాయి. కాబట్టి మీ స్నేహితుల గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీ స్నేహం అంత ఎక్కువ బలపడుతుంది. సాధారణంగా ఒకరినొకరు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది, దానికి చాలా కృషి కూడా చేయాలి. కానీ, ప్రస్తుతం సోషల్‌ నెట్‌వర్క్‌లో కేవలం ఒక ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌తో స్నేహితులు అయిపోతున్నారు. ఆన్‌లైన్‌లో మనతో మాట్లాడేవాళ్లు తమ నిజస్వరూపాన్ని దాచిపెట్టడం చాలా తేలిక. వాళ్లపై మనకు మంచి అభిప్రాయం కలిగేలా చేయడం వాళ్ల చేతిలో పనే. అందుకే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేసేముందు అవతలి వ్యక్తి ఎలాంటివాళ్లో ఆలోచించండి. పరిచయం లేనివాళ్లు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించినప్పుడు దాన్ని రిజెక్ట్‌ చేస్తే వాళ్లు బాధపడతారేమో అని ఆలోచించకండి. సోషల్‌ నెట్‌వర్క్‌ వల్ల వచ్చే ప్రమాదాలు తెలిసినవాళ్లు, దానికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ మీరు సోషల్‌ నెట్‌వర్క్‌ ఉపయోగించాలనుకుంటే ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?

సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి వీడియో చూడండి. తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • కామెంట్లు, ఫోటోలు పోస్ట్‌ చేసేముందు మీరు ఏ విషయాల గురించి ఆలోచించాలి?

  • ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌ను ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి?

  • సోషల్‌ నెట్‌వర్క్‌లో ఎంత టైమ్‌ గడపాలో లిమిట్‌ పెట్టుకోవడం ఎందుకు ముఖ్యం?—ఎఫె 5:15, 16