కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

యెహోవాపై ఆధారపడడానికి మూడు మార్గాలు

యెహోవాపై ఆధారపడడానికి మూడు మార్గాలు

దావీదు యెహోవా సహాయాన్ని తీసుకోవడం వల్లే గొల్యాతును ఓడించగలిగాడు. (1స 17:45) యెహోవా తన సేవకుల్ని రక్షించడానికి తన బలాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాడు. (2ది 16:9) మన అనుభవం, సామర్థ్యం మీద కాకుండా యెహోవా అందించే సహాయం మీద ఎలా ఆధారపడవచ్చు? దానికి మూడు మార్గాలు ఉన్నాయి:

  • ప్రార్థించండి. మనం ఎప్పుడు ప్రార్థించాలి? తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడగడానికే కాదు, ప్రలోభం ఎదురైనప్పుడు కూడా ప్రార్థించాలి, దాన్ని ఎదిరించే బలాన్ని ఇవ్వమని వేడుకోవాలి. (మత్త 6:12, 13) నిర్ణయం తీసేసుకున్నాక దాన్ని దీవించమని అడగడానికే కాదు, నిర్ణయం తీసుకోక ముందే తెలివి కోసం కూడా దేవునికి ప్రార్థించాలి.—యాకో 1:5

  • బైబిల్ని చదవండి, అధ్యయనం చేయండి. రోజూ బైబిల్ని చదవండి. (కీర్త 1:2) బైబిల్లో ఉన్నవాళ్ల గురించి ఆలోచించండి, నేర్చుకున్నవాటిని పాటించండి. (యాకో 1:23-25) మీకున్న అనుభవం మీద ఆధారపడకుండా ప్రతీరోజు ప్రీచింగ్‌కి సిద్ధపడండి. ముందే ప్రిపేర్‌ అయ్యి రావడం ద్వారా మీటింగ్స్‌ నుంచి పూర్తి ప్రయోజనం పొందండి.

  • యెహోవా సంస్థకు సహకరించండి. సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి, వాటిని వెంటనే పాటించండి. (సం 9:17) సంఘపెద్దలు ఇచ్చే సలహాలకు, సూచనలకు లోబడండి.—హెబ్రీ 13:17

హింసలు ఎదురైనా భయపడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

• సహోదరసహోదరీలకు ఎలాంటి హింసలు ఎదురయ్యాయి?

• వాటిని ఎదుర్కోవడానికి వాళ్లకు ఏం సహాయం చేసింది?