మన క్రైస్తవ జీవితం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి
చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి
చెడు అలవాట్లు లేనివాళ్లు మాత్రమే యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకోగలరు. (1పే 1:14-16) బైబిలు విద్యార్థులు చెడు అలవాట్లను మానుకున్నప్పుడు కుటుంబంతో కూడా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆర్థికంగా మెరుగౌతారు.
మీ బైబిలు విద్యార్థులకు యెహోవా నైతిక ప్రమాణాలు ఏంటో, ఆయన వాటిని ఎందుకు ఇచ్చాడో, మనం వాటిని పాటిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందుతామో వివరంగా చెప్పండి. తమ ఆలోచనా విధానాన్ని మార్చుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి. అలా చేస్తే, వాళ్లు యెహోవాకు నచ్చే పనులు చేయగలుగుతారు. (ఎఫె 4:22-24) ఎంతోకాలం నుండి అలవాటుగా చేస్తున్న చెడ్డ పనుల్ని సైతం యెహోవా సహాయంతో మానుకోగలరనే నమ్మకాన్ని వాళ్లలో నింపండి. (ఫిలి 4:13) తప్పుచేయాలనే శోధన ఎదురైన ప్రతీసారి యెహోవాకు ప్రార్థించాలని నేర్పించండి. ఎలాంటి పరిస్థితులు తప్పు చేయడానికి దారితీస్తాయో గుర్తించడానికి, వాటికి దూరంగా ఉండడానికి సహాయం చేయండి. వాళ్లకు హానిచేసే చెడు అలవాట్లను మానుకుని, మేలు చేసే మంచి అలవాట్లను పెంచుకోమని ప్రోత్సహించండి. యెహోవా సహాయంతో వాళ్లు చెడు అలవాట్లను మానుకోవడం చూసినప్పుడు మీకు సంతోషంగా అనిపిస్తుంది.
మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి . . . చెడు అలవాట్లు మానుకునేలా వీడియో చూడండి, ఆ తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
జాస్మిన్ మీద నమ్మకం ఉందని సంఘపెద్దలు, నీతా ఎలా చూపించారు?
-
ఆ అలవాటును మానుకోవడానికి నీతా జాస్మిన్‌కు ఎలా సహాయం చేసింది?
-
యెహోవా సహాయం కోసం జాస్మిన్ ఏం చేసింది?