కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

బైబిలు స్టడీ వీడియోలు ఎలా ఉపయోగించాలి?

బైబిలు స్టడీ వీడియోలు ఎలా ఉపయోగించాలి?

పరిచర్యలో ఉపయోగించడానికి మన దగ్గర నాలుగు బైబిలు స్టడీ వీడియోలు ఉన్నాయి. వీటిలో ఒక్కో వీడియోను ఏ ఉద్దేశంతో తయారుచేశారు?

  • బైబిలు ఎందుకు చదవాలి?పూర్తి వీడియో ఏ మతానికి చెందిన వాళ్లకైనా బైబిలు మీద ఆసక్తి కలిగించడానికి ఈ వీడియోను తయారుచేశారు. జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు బైబిల్లో వెదకమని ఈ వీడియో ప్రోత్సహిస్తుంది. అలాంటి ఒక ప్రశ్నకు జవాబు కూడా ఇస్తుంది. బైబిలు స్టడీ కోసం ఎలా అడగవచ్చో చెప్తుంది.

  • బైబిలు ఎందుకు చదవాలి? (చిన్న వీడియో) ఇది పూర్తి వీడియో లాంటిదే, కానీ దాదాపు ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. ప్రజలు బిజీగా ఉండే ప్రాంతాల్లో ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

  • బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? మనం ఉచితంగా ఇచ్చే బైబిలు స్టడీ మీద ఆసక్తి కలిగించడానికి దీన్ని తయారుచేశారు. బైబిలు స్టడీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ఇది జవాబు ఇస్తుంది. బైబిలు స్టడీ కోసం ఎలా అడగవచ్చో కూడా చెప్తుంది.

  • బైబిలు స్టడీకి స్వాగతం, బైబిలు విద్యార్థులకు చూపించడానికి దీన్ని తయారుచేశారు. ఈ వీడియో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం రెండవ పేజీలో కనిపిస్తుంది, కానీ ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషుర్‌లో ఇది కనిపించదు. అయినప్పటికీ, బ్రోషురు ఉపయోగించి చర్చిస్తున్నప్పుడు కూడా దీన్ని చూపించవచ్చు. పుస్తకంలోని పాఠాల్ని ఎలా తయారుచేశారో, స్టడీ ఎలా జరుగుతుందో ఈ వీడియో వివరిస్తుంది.

ఒక్కో వీడియోను ఒక్కో ఉద్దేశంతో తయారు చేసినప్పటికీ, పరిస్థితిని బట్టి ఆసక్తి చూపించిన వాళ్లకు మీరు ఏ వీడియోనైనా చూపించవచ్చు లేదా పంపించవచ్చు. ఈ వీడియోల్లో ఉన్న సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుని, పరిచర్యలో చక్కగా ఉపయోగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.