మన క్రైస్తవ జీవితం
యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
ప్రతీరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. చాలామంది తమకు అనిపించిన దాన్నిబట్టి లేదా ఎక్కువమంది ఏం చేస్తున్నారు అనే దాన్నిబట్టి నిర్ణయాలు తీసుకుంటారు. (నిర్గ 23:2; సామె 28:26) అయితే దేవుని మీద ఆధారపడేవాళ్లు యెహోవా మార్గాల గురించి ఆలోచిస్తూ, బైబిలు సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు.—సామె 3:5, 6.
ఈ లేఖనాలు సరైన నిర్ణయం తీసుకునేలా, మీకు ఏ పరిస్థితిలో సహాయం చేస్తాయో రాయండి.
విశ్వాసం చూపించినవాళ్లను అనుకరించండి, విశ్వాసం లేనివాళ్లను కాదు—మోషేను అనుకరించండి, ఫరోను కాదు వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:
సరైన నిర్ణయం తీసుకునేలా మోషే ఆదర్శం సహోదరునికి ఎలా సహాయం చేసింది?