కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 4-10

కీర్తనలు 16-17

మార్చి 4-10

పాట 111, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “యెహోవా, నా మంచితనానికి మూలం నువ్వే”

(10 నిమి.)

యెహోవాను సేవించేవాళ్లతో స్నేహం చేస్తే మనం సంతోషంగా ఉంటాం (కీర్త 16:2, 3; w18.12 26వ పేజీ, 11వ పేరా)

యెహోవాకు స్నేహితులైనందుకు మనం సంతృప్తితో ఉంటాం (కీర్త 16:5, 6; w14 2⁄15 29వ పేజీ, 4వ పేరా)

యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక కాపుదల వల్ల మనకు సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది (కీర్త 16:8, 9; w08 2⁄15 3వ పేజీ, 2-3 పేరాలు)

దావీదులాగే మన జీవితం కూడా అర్థవంతంగా ఉంటుంది, ఎందుకంటే మంచితనానికి మూలమైన యెహోవా ఆరాధన చుట్టే మన జీవితం తిరుగుతుంది.

ఇలా ప్రశ్నించుకోండి, ‘సత్యంలోకి రాకముందు కన్నా ఇప్పుడు నా జీవితం ఎలా మెరుగయ్యింది?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 17:8—“కనుపాపలా” అనే మాటకు అర్థమేంటి? (it-2-E 714వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(1 నిమి.) ఇంటింటి పరిచర్య. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రం ఇవ్వండి. (th 11వ అధ్యాయం)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రం ఇవ్వండి. ఇంటివ్యక్తి ఆసక్తి చూపిస్తే, యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే వీడియో చూపించి చర్చించండి. (th 9వ అధ్యాయం)

6. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) అనియత సాక్ష్యం. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రం ఇవ్వండి. (th 2వ అధ్యాయం)

7. శిష్యుల్ని చేసేటప్పుడు

మన క్రైస్తవ జీవితం

పాట 20

8. జ్ఞాపకార్థ ఆచరణకు మనం ఎలా సిద్ధపడవచ్చు?

(15 నిమి.) చర్చ.

యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడుతూ, మనం మార్చి 24, ఆదివారం రోజున ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే, ఇద్దరు వ్యక్తులు చూపించిన అపారమైన ప్రేమను గుర్తుచేసుకుంటాం. (లూకా 22:19; యోహా 3:16; 15:13) ఈ ప్రత్యేకమైన ఆచరణకు మనం ఎలా సిద్ధపడవచ్చు?

  • ప్రత్యేక ప్రసంగానికి, జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించే ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనండి. ఎవరెవర్ని పిలవాలో ఒక లిస్టు రాసుకుని, పిలవండి. ఎవరైనా మీ ప్రాంతానికి దూరంగా ఉంటే, వాళ్లకు దగ్గర్లో ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో jw.orgలో తెలుసుకోండి

  • మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎక్కువగా పరిచర్య చేయండి. మీరు 15 లేదా 30 గంటల సహాయ పయినీరు సేవ చేయగలరా?

  • యేసు భూజీవితంలో చివరి వారం జరిగిన ముఖ్యమైన సంఘటనల్ని, మార్చి 18 నుండి చదవడం మొదలుపెట్టండి. దానికోసం 6-7 పేజీల్లో “2024 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం” ఉంది. అందులో రోజుకు ఎంత చదవాలో మీరు నిర్ణయించుకోవచ్చు

  • జ్ఞాపకార్థ ఆచరణ రోజున, ప్రత్యేక ఉదయకాల ఆరాధనను jw.orgలో చూడండి

  • జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చిన కొత్తవాళ్లను, నిష్క్రియులను ఆప్యాయంగా పలకరించండి. వాళ్లకు ఏమైనా సందేహాలు ఉంటే, జ్ఞాపకార్థ ఆచరణ అయిపోయాక వివరించండి. వాళ్ల ఆసక్తిని పెంచడానికి మళ్లీ కలవండి

  • జ్ఞాపకార్థ ఆచరణకు ముందు, తర్వాత కూడా విమోచనా క్రయధనం గురించి ధ్యానించండి

యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమంలో ఈ వీడియోని ఎలా ఉపయోగించవచ్చు?

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 73, ప్రార్థన