కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏప్రిల్‌ 28–మే 4

సామెతలు 11

ఏప్రిల్‌ 28–మే 4

పాట 90, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. అలా మాట్లాడకండి!

(10 నిమి.)

‘పొరుగువానికి’ హాని చేసే మాటలు మాట్లాడకండి (సామె 11:9; w02 5/15 26 ¶4)

గొడవలు పెట్టే మాటలు మాట్లాడకండి (సామె 11:11; w02 5/15 27 ¶2-3)

రహస్యంగా ఉంచాల్సిన విషయాలు వేరేవాళ్లకు చెప్పకండి (సామె 11:12, 13; w02 5/15 27 ¶5)

దీనిగురించి ఆలోచించండి: లూకా 6:45 లో ఉన్న యేసు మాటలు, హానికరమైన మాటలు మాట్లాడకుండా ఎలా సహాయం చేస్తాయి?

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • సామె 11:17—దయగా ఉండడం మనకెలా మేలు చేస్తుంది? (g20.1 11, బాక్సు)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. ఈమధ్య మీటింగ్‌లో నేర్చుకున్న విషయాన్ని ఒకరికి చెప్పడానికి ప్రయత్నించండి. (lmd పాఠం 2 పాయింట్‌ 4)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. బోధనా పనిముట్ల నుండి ఒక వీడియోను చూపించండి. (lmd పాఠం 8 పాయింట్‌ 3)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పి, దాన్ని ఎలా చేస్తారో చూపించండి. (lmd పాఠం 10 పాయింట్‌ 3)

మన క్రైస్తవ జీవితం

పాట 157

7. మీ మాటలు శాంతిని పాడుచేసేవిగా ఉండనివ్వకండి

(15 నిమి.) చర్చ.

మనం అపరిపూర్ణులం కాబట్టి మన మాటల్లో తప్పులు దొర్లుతుంటాయి. (యాకో 3:8) అయితే దానివల్ల వచ్చే సమస్యల గురించి ముందుగానే ఆలోచిస్తే, మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉంటాం. అలా చేస్తే తర్వాత బాధపడాల్సిన పని ఉండదు. సంఘంలో శాంతిని పాడు చేసే అవకాశం ఉన్న కొన్ని రకాల మాటలు ఏంటంటే:

  • గొప్పలు చెప్పుకోవడం. ఇలాంటి మాటల వల్ల పోటీతత్వం, ఈర్ష్య పెరుగుతాయి.—సామె 27:2

  • నిజాయితీ లేకుండా మాట్లాడడం. కేవలం అబద్ధాలే కాదు, కావాలని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడే మాటలు కూడా దీని కిందికి వస్తాయి. మనం చెప్పేది చిన్న అబద్ధమే అయినా దానివల్ల ఇతరులకు మన మీద నమ్మకం పోయి, మన పేరు పాడౌతుంది.—ప్రసం. 10:1

  • హానికరమైన పుకార్లు. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లు ఇతరుల వ్యక్తిగత విషయాలు బయటకు చెప్తారు లేదా వాస్తవాలు మార్చేసి లేనిపోనివి చెప్తూ ఉంటారు. (1తి 5:13) అది విభజనలకు, గొడవలకు దారితీస్తుంది

  • కోపంగా అరవడం. ఇలా చేసేవాళ్లు తమను నొప్పించిన వాళ్ల మీద అదుపులేకుండా కోపంగా అరిచి మాట్లాడతారు. (ఎఫె 4:26) దీనివల్ల ఇతరులకు బాధ కలుగుతుంది.—సామె 29:22

శాంతిని పాడుచేసే వాటిని వదిలేయండి—చిన్నభాగం వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • కొన్నిసార్లు మన మాటలు సంఘంలో శాంతిని ఇట్టే పాడుచేయవచ్చని ఎందుకు చెప్పవచ్చు? దీని నుండి మీరేం నేర్చుకున్నారు?

శాంతిని ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోవడానికి, “శాంతిగా ఉండడానికి కృషిచేస్తూ ఉండండి” వీడియో చూడండి.

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | 2025 ప్రాదేశిక సమావేశం కొత్త పాట, ప్రార్థన