మార్చి 17-23
సామెతలు 5
పాట 122, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. లైంగిక పాపానికి చాలా దూరంగా ఉండండి
(10 నిమి.)
లైంగిక పాపమనే వలలో మనం ఈజీగా చిక్కుకునే అవకాశం ఉంది (సామె 5:3; w00 7/15 29 ¶2)
లైంగిక పాపం చివరికి బాధనే మిగులుస్తుంది (సామె 5:4, 5; w00 7/15 29 ¶3)
లైంగిక పాపానికి చాలా దూరంగా ఉండండి (సామె 5:8; w00 7/15 29 ¶6)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
సామె 5:9—లైంగిక పాపం వల్ల ‘మీ పేరు ఎలా పాడవుతుంది’? (w00 7/15 29 ¶8)
-
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) సామె 5:1-23 (th అధ్యాయం 5)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. క్రైస్తవుడు కాని వ్యక్తిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించి, తనకు దగ్గర్లో ఆ ఆచరణ ఎక్కడ జరుగుతుందో jw.orgలో చూపించండి. (lmd పాఠం 6 పాయింట్ 4)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) ఇంటింటి పరిచర్య. ఇంతకుముందు కలిసినప్పుడు ఇంటివ్యక్తి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానాన్ని తీసుకుని, ఆసక్తి చూపించాడు. (lmd పాఠం 9 పాయింట్ 5)
6. శిష్యుల్ని చేసేటప్పుడు
(5 నిమి.) lff పాఠం 16 “ఒక్కమాటలో,” “మీరేం నేర్చుకున్నారు?,” “ఇలా చేసి చూడండి.” యేసుకు పెళ్లయిందా అని విద్యార్థి అడిగినప్పుడు, తనే సొంతగా ఎలా పరిశోధన చేసి తెలుసుకోవచ్చో చూపించండి. (lmd పాఠం 11 పాయింట్ 4)
పాట 121
7. డేటింగ్ చేసేటప్పుడు పవిత్రంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి
(15 నిమి.) చర్చ.
ఒకరినొకరు ఇష్టపడుతున్న జంట కలిసి గడిపే సమయాన్ని డేటింగ్ అంటారు. బయటి వాళ్లయితే డేటింగ్ చేస్తున్నప్పుడు నలుగురిలో లేదా ఒంటరిగా కలుసుకుంటారు. డేటింగ్ రహస్యంగా లేదా అందరికీ తెలిసేలా చేస్తారు. నేరుగా కలిసి లేదా ఫోన్‌లో, మెసేజ్‌ల్లో మాట్లాడుకుంటారు. అయితే, మనం డేటింగ్ ఏదో సరదాగా అన్నట్లు కాదుగానీ నిజంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తాం. యౌవనులైనా, పెద్దవాళ్లయినా డేటింగ్ సమయంలో లైంగిక పాపం చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?—సామె 22:3.
పెళ్లి కోసం సిద్ధపడడం—1వ భాగం: డేటింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా?—చిన్నభాగం అనే వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
-
పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేకుండా డేటింగ్ చేయడం ఎందుకు తప్పు? (సామె 13:12; లూకా 14:28-30)
-
వీడియోలో చూసిన అమ్మానాన్నలు వాళ్ల కూతురుకి సహాయం చేసిన విధానంలో మీకేది బాగా నచ్చింది?
సామెతలు 28:26 చదవండి. తర్వాత ఇలా అడగండి:
-
తప్పు చేసే పరిస్థితి రాకుండా డేటింగ్ చేస్తున్న జంట ముందే ఎలా జాగ్రత్తపడవచ్చు?
-
డేటింగ్ చేస్తున్న జంట మరీ చనువుగా ఉండడం, చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి విషయాల్లో ముందే మాట్లాడుకొని హద్దులు పెట్టుకోవడం ఎందుకు తెలివైన పని?
ఎఫెసీయులు 5:3, 4 చదవండి. తర్వాత ఇలా అడగండి:
-
డేటింగ్ చేస్తున్న జంట ఫోన్లో గానీ ఆన్‌లైన్‌లో గానీ మాట్లాడుకునేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 24వ అధ్యాయంలో 1-6 పేరాలు