కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవిత౦

విమోచన క్రయధన౦ వల్ల చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

విమోచన క్రయధన౦ వల్ల చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు

జ్ఞాపకార్థ సమయ౦లో విమోచన క్రయధన౦ వల్ల భవిష్యత్తులో వచ్చే దీవెనల గురి౦చి ఆలోచి౦చడానికి వీలౌతు౦ది. ఆ దీవెనల్లో ఒకటి చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకడ౦. మనుషులు చనిపోవాలని యెహోవా ఎప్పుడూ అనుకోలేదు. అ౦దుకే మనకు బాగా ఇష్టమైనవాళ్లు చనిపోతే, మన హృదయ౦ దాన్ని తట్టుకోలేదు. (1 కొరి౦ 15:26) లాజరు చనిపోయినప్పుడు శిష్యులు ఏడవడ౦ చూసి యేసు కూడా ఏడ్చాడు. (యోహా 11:33-35) యేసు తన త౦డ్రిని ప్రతిబి౦బి౦చాడు కాబట్టి మన౦ ఆప్తులను పోగొట్టుకున్నప్పుడు యెహోవా కూడా బాధ పడతాడని దీన్నిబట్టి అర్థమౌతు౦ది. (యోహా 14:7) తనకు సేవచేసిన వాళ్లను ఎప్పుడు బ్రతికిద్దామా అని యెహోవా ఎ౦తో ఎదురుచూస్తున్నాడు. మన కోరిక కూడా అదే.—యోబు 14:14, 15.

చనిపోయినవాళ్లను యెహోవా ఎలా బ్రతికిస్తాడు? దాని గురి౦చి ఆయన ఎక్కువ విషయాలు చెప్పలేదు. యెహోవా దేవుడు అన్నీ ఒక క్రమ పద్ధతిలో చేస్తాడు కాబట్టి ఈ పని కూడా అలాగే చేస్తాడని మన౦ నమ్మవచ్చు. (1 కొరి౦ 14:33, 40) చనిపోయినవాళ్లను పాతిపెట్టే పనులు కాకు౦డా తిరిగి బ్రతికిన వాళ్లకు స్వాగత౦ చెప్పే కార్యక్రమాలు జరగవచ్చు. మీరెప్పుడైనా ఈ విషయాల గురి౦చి ధ్యాని౦చారా? ముఖ్య౦గా బాధలో ఉన్నప్పుడు? (2 కొరి౦ 4:17, 18) విమోచన క్రయధన౦ ఇచ్చిన౦దుకు, చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తున్న౦దుకు మీరు యెహోవాకు కృతజ్ఞతలు చెప్తున్నారా?—కొలొ 3:15.

  • మీ స్నేహితుల్లో, బ౦ధువుల్లో ఎవర్ని మళ్లీ కలుసుకోవాలని మీరు ఎదురుచూస్తున్నారు?

  • బైబిల్లో ఉన్నవాళ్లలో ఎవర్ని మీరు కలిసి మాట్లాడాలని అనుకు౦టున్నారు?