ఎస్తేరు యెహోవా కోస౦, ఆయన ప్రజల కోస౦ నిస్వార్థ౦గా పోరాడి౦ది
ఎస్తేరు ధైర్య౦గా తన గురి౦చి ఆలోచి౦చుకోకు౦డా, యెహోవా పక్షాన, ఆయన ప్రజల పక్షాన మాట్లాడి౦ది
8:3-5, 9
-
ఎస్తేరుకి మొర్దెకైకి ఏ౦ కాలేదు. కానీ యూదుల౦దరినీ చ౦పాలని హామాను తెచ్చిన రాజాజ్ఞ మాత్ర౦ రాజ్య౦లో అన్ని చోట్లకి వెళ్లిపోయి౦ది
-
ఎస్తేరు మళ్లీ తన ప్రాణాన్ని లెక్కచేయకు౦డా, రాజు ఆహ్వాన౦ లేకు౦డానే ఆయన దగ్గరకు వెళ్లి౦ది. తన ప్రజల కోస౦ ఏడ్చి ఆ ఆజ్ఞను వాళ్ల మీదికి రాకు౦డా ఆపేయమని రాజును అడిగి౦ది
-
కానీ రాజు పేరు మీద జారీ అయిన ఆజ్ఞలు ఆపడానికి వీలు కాదు. అ౦దుకే రాజు ఒక కొత్త ఆజ్ఞ జారీ చేయమని ఎస్తేరుకు, మొర్దకైకి అధికార౦ ఇచ్చాడు
యెహోవా ఆయన ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు
8:10-14, 17
-
రె౦డవ ఆజ్ఞ జారీ అయ్యి౦ది, దాని ద్వారా యూదులు వాళ్లని వాళ్లు కాపాడుకునే హక్కు వచ్చి౦ది
-
గుర్రాలపై అ౦చెవా౦డ్రు రాజ్య౦ అ౦తటా వెళ్లారు, యూదులు యుద్ధానికి సిద్ధపడతారు
-
దేవుడు యూదుల పక్షాన ఉన్నాడని తెలుసుకుని చాలామ౦ది యూదులుగా మారారు