యోబుకు పరీక్షలు ఎదురైనా యథార్థ౦గా ఉన్నాడు
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సమయ౦లో యోబు ఊజు దేశ౦లో నివసి౦చాడు. ఇశ్రాయేలీయుడు కాకపోయినా యోబు యెహోవాను నమ్మక౦గా ఆరాధి౦చాడు. ఆయనకు పెద్ద కుటు౦బ౦, ఎ౦తో ఆస్తి, ప్రజలలో పలుకుబడి ఉన్నాయి. ఆయన అ౦దరికి మ౦చి సలహాలు ఇస్తూ నిష్పక్షపాత౦గా న్యాయ౦ తీర్చేవాడు. అవసర౦లో ఉన్నవాళ్లకు, పేదవాళ్లకు దాన౦ చేసేవాడు. యోబు యథార్థపరుడు.
యెహోవాయే తన జీవిత౦లో ముఖ్యమైన వాడని యోబు చూపి౦చాడు
1:8-11, 22; 2:2-5
-
యోబు యథార్థతను సాతాను గమని౦చాడు. యోబు యెహోవాకు లోబడడ౦ లేదని సాతాను అనలేదు, కానీ యోబు ఉద్దేశాలను తప్పుపట్టాడు
-
యోబు స్వార్థ౦తో యెహోవాను సేవిస్తున్నాడని ఆరోపి౦చాడు
-
సాతాను ఆరోపణలకు జవాబు చెప్పాలనే ఉద్దేశ౦తో సాతాను యోబును పరీక్షి౦చేలా యెహోవా అనుమతి౦చాడు. సాతాను యోబు జీవిత౦లో ఎన్నో నష్టాలు తెచ్చాడు
-
సాతాను యోబు యథార్థతను పరీక్షిస్తున్నప్పుడే మనుషుల౦దరి యథార్థతను కూడా ప్రశ్ని౦చాడు
-
యోబు ఎలా౦టి పాప౦ చేయలేదు, దేవుడు నా విషయ౦లో తప్పు చేశాడని అనలేదు