కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 25

“అప్రమత్తంగా ఉండండి”

“అప్రమత్తంగా ఉండండి”

25:1-12

పదిమంది కన్యల ఉపమానం యేసు తన అభిషిక్త అనుచరులకే చెప్పినా, అందులోని ముఖ్య పాఠం క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. (w15 3/15 12-16) “కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఆ రోజు గానీ, ఆ గంట గానీ మీకు తెలీదు.” (మత్త 25:13) యేసు చెప్పిన ఉపమానాన్ని మీరు వివరించగలరా?

  • పెళ్లికొడుకు (1వ వచనం)—యేసు

  • సిద్ధపడి ఉన్న బుద్ధిగల కన్యలు (2వ వచనం)—అంతం వరకు తమ నియామకాన్ని నమ్మకంగా చేయడానికి సిద్ధపడి, జ్యోతుల్లా ప్రకాశించే అభిషిక్త క్రైస్తవులు (ఫిలి 2:15)

  • “పెళ్లికొడుకు వచ్చేశాడు” అనే కేక (6వ వచనం)—యేసు ప్రత్యక్షతకు రుజువు

  • బుద్ధిలేని కన్యలు (8వ వచనం)—పెళ్లికొడుకును కలవడానికి వెళ్లినప్పటికీ అప్రమత్తంగా ఉండడంలో, తమ యథార్థతను కాపాడుకోవడంలో విఫలమైన అభిషిక్త క్రైస్తవులు

  • బుద్ధిగల కన్యలు తమ దగ్గరున్న నూనెను ఇవ్వలేదు (9వ వచనం)—చివరి ముద్ర పొందిన తర్వాత యథార్థంగా ఉన్న అభిషిక్త క్రైస్తవులు, తమ యథార్థతను కాపాడుకోలేకపోయినవాళ్లకు సహాయం చేయలేరు

  • “పెళ్లికొడుకు వచ్చేశాడు” (10వ వచనం)—మహాశ్రమ చివర్లో తీర్పు ప్రకటించడానికి యేసు వస్తాడు

  • బుద్ధిగల కన్యలు పెళ్లికొడుకుతోపాటు పెళ్లి విందు కోసం లోపలికి వెళ్తారు, తలుపులు మూయబడ్డాయి (10వ వచనం)—యేసు తన నమ్మకమైన అభిషిక్తుల్ని పరలోకానికి సమకూరుస్తాడు. అయితే, నమ్మకంగాలేని వాళ్లు తమ పరలోక బహుమానాన్ని పోగొట్టుకుంటారు