కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఎలా సిద్ధపడాలో మన విద్యార్థులకు నేర్పించడం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఎలా సిద్ధపడాలో మన విద్యార్థులకు నేర్పించడం

ఎందుకు ప్రాముఖ్యం: బైబిలు విద్యార్థులు ముందుగా సిద్ధపడి ఉంటే, మనం బోధించే విషయాల్ని వెంటనే అర్థం చేసుకొని వాటిని గుర్తుంచుకోగలుగుతారు. వాళ్లు ఎంత ఎక్కువగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటే, అంత త్వరగా అభివృద్ధి సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో ‘అప్రమత్తంగా ఉండాలంటే’ బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా వాళ్లు కూటాలకు, పరిచర్యకు సిద్ధపడాల్సి ఉంటుంది. (మత్త 25:13) కాబట్టి ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకోవడం, మంచి అధ్యయన అలవాట్లు కలిగి ఉండడం వాళ్లకు జీవితాంతం ప్రయోజనకరంగా ఉంటుంది. మొదటినుండే మనం మన విద్యార్థులకు బైబిలు స్టడీ కోసం సిద్ధపడి ఉండడం అలవాటు చేయాలి.

ఎలా చేయవచ్చు:

  • మీరే ఆదర్శంగా ఉండండి. (రోమా 2:21) స్టడీకి సిద్ధపడే ప్రతీసారీ, విద్యార్థిని మనసులో పెట్టుకొని సిద్ధపడండి. (km 11/15 3) మీ ప్రచురణలో గీతలు పెట్టుకున్న వాటిని అతనికి చూపించండి

  • సిద్ధపడమని అతన్ని ప్రోత్సహించండి. బైబిలు స్టడీ చక్కగా కొనసాగుతున్నప్పుడు, సిద్ధపడడం బైబిలు స్టడీలో ఒక భాగమని చెప్పండి. దానివల్ల వచ్చే ప్రయోజనాల్ని వివరించండి. అతనికున్న సమయంలో సిద్ధపడడానికి సమయాన్ని ఎలా తీసుకోవచ్చో ఉపయోగపడే సలహాలు ఇవ్వండి. కొంతమంది బోధకులు, స్టడీ జరిగేటప్పుడు గీత గీసి ఉన్న వాళ్ల పుస్తకాన్ని వాడమని విద్యార్థికి ఇస్తారు. అప్పుడు దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో విద్యార్థి గ్రహించగలుగుతాడు. అతను సిద్ధపడినప్పుడు అతన్ని మెచ్చుకోండి

  • ఎలా ప్రిపేర్‌ అవ్వాలో లేదా సిద్ధపడాలో అతనికి చూపించండి. అధ్యయనం నిర్వహించే కొత్తలో కొంతమంది బోధకులు, ఒకసారి స్టడీ చేసే సమయాన్నంతా విద్యార్థి ఎలా సిద్ధపడాలో నేర్పించడానికి ఉపయోగిస్తారు