“మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి”
గర్విష్ఠులైన శాస్త్రులు, పరిసయ్యులు ఇతరులను మెప్పించాలని, అందరిలో గొప్పవాళ్లుగా ఉండాలని కోరుకునేవాళ్లు. (మత్త 23:5-7) కానీ యేసు అలా కాదు. “మానవ కుమారుడు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవచేయడానికి . . . వచ్చాడు.” (మత్త 20:28) ఆరాధనకు సంబంధించిన పనుల్లో, మనకు ఎక్కువగా గుర్తింపు, ఘనత తెచ్చే వాటినే చేయడానికి ప్రయత్నిస్తున్నామా? ఇతరులకు ఏ విషయాల్లో సహాయం అవసరమో వాటిని చేస్తే, యెహోవా దగ్గర యేసు లాంటి గొప్ప పేరు సంపాదించుకుంటాం. అలాంటి పనులు ఎక్కువగా ఇతరులకు కనిపించవు, కానీ యెహోవా వాటిని గమనిస్తాడు. (మత్త 6:1-4) వినయంగల సేవకులు ఇలా చేస్తారు . . .
-
రాజ్యమందిరాన్ని శుభ్రం చేసి దాన్ని మంచి స్థితిలో ఉంచడానికి సహాయం చేస్తారు
-
పెద్దవాళ్లకు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు
-
రాజ్యానికి సంబంధించిన పనుల్లో ఆర్థికంగా మద్దతిస్తారు