కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్చి 16-22

ఆదికాండం 25-26

మార్చి 16-22
  • పాట 18, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు”: (10 నిమి.)

    • ఆది 25:27, 28—కవల పిల్లలైన ఏశావు, యాకోబుల వ్యక్తిత్వాలు, వాళ్లు చేసే పనులు వేరుగా ఉండేవి (it-1-E 1242వ పేజీ)

    • ఆది 25:29, 30—ఏశావుకు ఆకలేయడం వల్ల, అలసిపోవడం వల్ల తన పనుల్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు

    • ఆది 25:31-34—కృతజ్ఞతలేని ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక్క పూట భోజనం కోసం యాకోబుకు అమ్మేశాడు (w19.02 16వ పేజీ 11వ పేరా; it-1-E 835వ పేజీ)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 25:31-34—ఈ లేఖన వృత్తాంతాన్ని బట్టి మెస్సీయ రావాల్సిన వంశం జ్యేష్ఠత్వపు హక్కుతో ముడిపడివుందని కొందరు అనుకున్నారు, కానీ ఆ అవగాహన ఎందుకు సరైనది కాదు? (హెబ్రీ 12:16; w17.12 15వ పేజీ 5-7 పేరాలు)

    • ఆది 26:7—ఇస్సాకు ఈ సందర్భంలో ఎందుకు మొత్తం నిజాన్ని చెప్పలేదు? (it-2-E 245వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 26:1-18 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: ఇంటివ్యక్తికి జవాబు తెలీకపోతే మనం అతన్ని ఇబ్బందిపెట్టకుండా ఎలా ఉండవచ్చు? ప్రచారకుడు మత్తయి 20:28 లేఖనంపై ఆలోచింపజేసేలా మాట్లాడాడని ఎలా చెప్పవచ్చు?

  • మొదటిసారి రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్నదాన్ని ఉపయోగించండి. (3)

  • మొదటిసారి రిటన్‌ విజిట్‌: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత మనం నేర్చుకోవచ్చు పుస్తకాన్ని అందించండి. (15)

మన క్రైస్తవ జీవితం

  • పాట 78

  • దేవుడు చెప్తున్న మంచివార్త! బ్రోషురు నుండి అధ్యయనం చేస్తున్నప్పుడు వీడియోలను ఉపయోగించండి: (15) చర్చ. చనిపోయిన తర్వాత ఏమౌతుంది? దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు? వీడియోలను ప్లే చేయండి. (మా కూటాలు, పరిచర్య అనే వీడియో కాటగిరీ). ఒక్కో వీడియో చూపిస్తూ, ఈ ప్రశ్నలు అడగండి: మంచివార్త బ్రోషుర్‌ నుండి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ వీడియోను ఎలా ఉపయోగించవచ్చు? (mwb19.03 7వ పేజీ) ఇతరులకు బోధించడానికి వీడియోలోని ఏ విషయాలు మీకు సహాయకరంగా ఉన్నాయి? ఆన్‌లైన్‌ బ్రోషుర్‌లో వీడియోలకు లింక్స్‌ ఉన్నాయని అందరికీ గుర్తుచేయండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 73వ పాఠం.

  • ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)

  • పాట 66, ప్రార్థన