కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠చూపులేనివాళ్లకు సాక్ష్యమివ్వడం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠చూపులేనివాళ్లకు సాక్ష్యమివ్వడం

ఎందుకు ప్రాముఖ్యం: చూపులేనివాళ్లలో చాలామంది కొత్తవాళ్లతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి అలాంటివాళ్లకు సాక్ష్యమివ్వాలంటే నైపుణ్యం కావాలి. చూపులేనివాళ్ల పట్ల యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తాడు. (లేవీ 19:14) యెహోవా గురించి నేర్చుకునేలా చూపులేని వాళ్లకు సహాయం చేయడం ద్వారా మనం ఆయన్ని అనుకరించవచ్చు.

ఎలా చేయాలి:

  • చూపులేని వాళ్లకోసం “వెదకండి.” (మత్త 10:11) ఎవరి ఇంట్లోనైనా చూపులేనివాళ్లు ఉన్నట్లు మీకు తెలుసా? మీ క్షేత్రంలో చూపులేని వాళ్లకోసం తయారుచేయబడిన ప్రచురణల్ని ఇష్టపడే స్కూళ్లు గానీ అలాంటివాళ్ల బాగోగులు చూసుకునే కేంద్రాలు గానీ అలాంటివి ఇంకేవైనా ఉన్నాయా?

  • వ్యక్తిగత శ్రద్ధ చూపించండి. చూపులేనివాళ్లతో మీరు స్నేహపూర్వకంగా ఉంటూ, వాళ్లపట్ల శ్రద్ధ చూపిస్తే వాళ్లు మీతో ఇబ్బందిలేకుండా మాట్లాడతారు. స్థానికంగా ఆసక్తి కలిగించే ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతూ సంభాషణ మొదలుపెట్టడానికి ప్రయత్నించండి.

  • యెహోవాను తెలుసుకునేలా సహాయం చేయండి. చూపులేని వాళ్లకోసం సంస్థ ఎన్నో ఫార్మాట్‌లలో ప్రచురణల్ని అందిస్తోంది. చూపులేని వ్యక్తి ఏ ఫార్మాట్‌ని ఉపయోగించడానికి ఇష్టపడతాడో అడగండి. అతనికి కావాల్సిన ఫార్మాట్‌లో ప్రచురణలు లిటరేచర్‌ సర్వెంట్‌ రిక్వెస్టు చేసేలా సేవా పర్యవేక్షకుడు నిర్ధారించుకోవాలి.