మార్చి 9-15
ఆదికాండం 24
పాట 132, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“ఇస్సాకు కోసం భార్య”: (10 నిమి.)
ఆది 24:2-4—యెహోవా ఆరాధికురాల్ని తన కొడుకు ఇస్సాకుకు భార్యగా తీసుకురమ్మని అబ్రాహాము తన సేవకుణ్ణి పంపాడు (wp-E 16.3 14వ పేజీ, 3వ పేరా)
ఆది 24:11-15—అబ్రాహాము సేవకుడు రిబ్కాను బావి దగ్గర కలిశాడు (wp-E 16.3 14వ పేజీ, 4వ పేరా)
ఆది 24:58, 67—ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి రిబ్కా ఒప్పుకుంది (wp-E 16.3 14వ పేజీ, 6-7 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
ఆది 24:19, 20—ఈ వచనాల్లో, రిబ్కా చేసిన పనుల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? (wp-E 16.3 12-13 పేజీలు)
ఆది 24:65—రిబ్కా తల మీద ఎందుకు ముసుగు వేసుకుంది, అది మనకు ఏ పాఠం నేర్పిస్తుంది? (wp-E 16.3 15వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 24:1-21 (2)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత ప్రేక్షకులను ఈ ప్రశ్నలు అడగండి: ప్రచారకుడు ప్రశ్నల్ని సమర్థవంతంగా ఉపయోగించాడని ఎలా చెప్పవచ్చు? ఇంటావిడ యేసు గురించి సమాధానం ఇచ్చినప్పుడు ప్రచారకుడు ఎలా స్పందించాడు?
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్నదాన్ని ఉపయోగించండి. (1)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (12)
జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. ఇంటివ్యక్తికి ఆసక్తి కలుగుతుంది. యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే వీడియోను పరిచయం చేసి చర్చించండి. (వీడియో ప్లే చేయకండి) (11)
మన క్రైస్తవ జీవితం
జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మార్చి 14, శనివారం నుండి మొదలౌతుంది: (8 నిమి.) చర్చ. ప్రేక్షకులకు తలా ఒక ఆహ్వాన ప్రతి ఇచ్చి, సమీక్షించండి. ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న వీడియోను చూపించి, చర్చించండి. క్షేత్రాన్ని పూర్తి చేయడానికి స్థానికంగా చేసిన ఏర్పాట్లను క్లుప్తంగా తెలియజేయండి.
“నేను ఎవరిని ఆహ్వానించాలి?”: (7 నిమి.) చర్చ.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 72వ పాఠం.
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 37, ప్రార్థన