కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ జీవితం

నేను ఎవరిని ఆహ్వానించాలి?

నేను ఎవరిని ఆహ్వానించాలి?

ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు మనతోపాటు హాజరయ్యేలా క్షేత్రంలోని ప్రజల్ని ఆహ్వానించడానికి మనం ప్రత్యేకంగా కృషి చేస్తాం. వాళ్లలో చాలామంది మనకు పరిచయం లేనివాళ్లే. మనం పరిచయం ఉన్నవాళ్లను కూడా ఆహ్వానించాలి. పరిచయస్థుల నుండి ఆహ్వానాన్ని అందుకున్నవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. (yb-E 08 11వ పేజీ, 3వ పేరా; 14వ పేజీ, 1వ పేరా) మీరు ఎవరెవర్ని ఆహ్వానించవచ్చు?

  • బంధువుల్ని

  • తోటి ఉద్యోగస్థుల్ని, తోటి విద్యార్థుల్ని

  • ఇరుగుపొరుగువాళ్లను

  • రిటన్‌ విజిట్‌ల వాళ్లను, గతంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న బైబిలు స్టడీల వాళ్లను

అంతేకాకుండా, పెద్దలు నిష్క్రియులను ఆహ్వానిస్తారు. మీకు తెలిసినవాళ్లు మీ ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే అప్పుడెలా? వాళ్లు నివసించే ప్రాంతంలో జ్ఞాపకార్థ ఆచరణ ఎక్కడ జరుగుతుందో jw.org హోమ్‌ పేజీ పైన మా గురించి ట్యాబ్‌లో “జ్ఞాపకార్థ ఆచరణ” క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. మీరు ఈ సంవత్సరం ఆచరణకు సిద్ధపడుతుండగా, మీరు ఎవరెవర్ని పిలవవచ్చో ఆలోచించి లిస్టు వేసుకొని, వాళ్లను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించండి.