కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి

ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించండి

ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించండి

రిటన్‌ విజిట్‌లు, బైబిలు స్టడీలు చేస్తున్నప్పుడు వినేవాళ్లు ముఖ్యాంశాలను అర్థం చేసుకునేలా మనం సహాయం చేయాలి. ఆ ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో బోధించినప్పుడు అవి వాళ్ల హృదయాన్ని చేరతాయి, ఎక్కువకాలం గుర్తుంటాయి.

మీరు రిటన్‌ విజిట్‌కు, బైబిలు స్టడీకు సిద్ధపడుతున్నప్పుడు అనవసరమైన వివరాల మీద కాకుండా ముఖ్యాంశాల మీద మనసుపెట్టండి. వాటిని వివరించడానికి రోజువారీ జీవితంలోని ఉదాహరణల్ని ఎంచుకోండి. (మత్త 5:14-16; మార్కు 2:21; లూకా 14:7-11) అలా ఎంచుకునేటప్పుడు మీ విద్యార్థుల నేపథ్యాన్ని, వాళ్లు చేసే పనుల్ని మనసులో ఉంచుకోండి. (లూకా 5:2-11; యోహా 4:7-15) మీరు వివరిస్తున్న విషయం బైబిలు విద్యార్థికి అర్థమైనప్పుడు మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.

శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—ముఖ్యాంశాల్ని ఉదాహరణలతో వివరించడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • లేఖనాల్ని అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు సహాయం ఎందుకు అవసరమౌతుంది?

  • రోమీయులు 5:12⁠లో ఉన్న సత్యాన్ని వివరించడానికి నీతా ఏ ఉదాహరణ ఉపయోగించింది?

  • మంచి ఉదాహరణలు హృదయాన్ని చేరతాయి

    మంచి ఉదాహరణలు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి?

  • ప్రీచింగ్‌లో యెహోవా సంస్థ ఇచ్చే వీడియోలను, ఇతర బోధనా పనిముట్లను ఎందుకు ఉపయోగించాలి?