కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

క్రమశిక్షణ​—⁠యెహోవా ప్రేమకు ఒక రుజువు

క్రమశిక్షణ​—⁠యెహోవా ప్రేమకు ఒక రుజువు

క్రమశిక్షణ కేవలం ఉపదేశించడానికి, బోధించడానికే కాదు. సరిదిద్దడానికి తిరిగి సరైన దారిలో తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది. యెహోవా క్రమశిక్షణ ఇచ్చి, తనకు నచ్చేవిధంగా ఆయన్ని ఆరాధించడానికి మనకు సహాయం చేస్తాడు. (రోమా 12:1; హెబ్రీ 12:10, 11) కొన్నిసార్లు క్రమశిక్షణ బాధ కలిగిస్తుంది, కానీ దానివల్ల దీవెనలు వస్తాయి. (సామె 10:7) క్రమశిక్షణ ఇచ్చేవాళ్లు, క్రమశిక్షణ తీసుకునేవాళ్లు ఏ విషయాలు మనసులో ఉంచుకోవాలి?

ఇచ్చేవాళ్లు. సంఘపెద్దలు, తల్లిదండ్రులు, ఇతరులు క్రమశిక్షణను యెహోవాలా దయగా, ప్రేమగా ఇవ్వడానికి చాలా కృషిచేస్తారు. (యిర్మీ 46:28) కొన్నిసార్లు పరిస్థితిని బట్టి తీవ్రమైన గద్దింపును కూడా ఇవ్వాల్సిరావచ్చు, అలాంటి సందర్భాల్లో కూడా ప్రేమగానే ఇవ్వాలి.—తీతు 1:13.

తీసుకునేవాళ్లు. క్రమశిక్షణ ఏ రూపంలో వచ్చినా దాన్ని తిరస్కరించకూడదు, అవసరమైన మార్పుల్ని వెంటనే చేసుకోవాలి. (సామె 3:11, 12) అపరిపూర్ణ మనుషులందరికీ క్రమశిక్షణ అవసరం, అయితే ఆ క్రమశిక్షణ మనకు వేర్వేరు మార్గాల్లో దొరకవచ్చు. ఉదాహరణకు బైబిల్లో ఏదైనా చదివినప్పుడు లేదా మీటింగ్స్‌లో ఏదైనా విన్నప్పుడు, కొన్నిసార్లు న్యాయనిర్ణయ కమిటీ ద్వారా కూడా ఆ క్రమశిక్షణ దొరకవచ్చు. క్రమశిక్షణను స్వీకరించి అవసరమైన మార్పులు చేసుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది, శాశ్వత జీవితాన్ని కూడా సొంతం చేసుకుంటాం.—సామె 10:17.

“యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు” వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • కేనన్‌ చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, పెద్దయ్యాక ఎలా మారిపోయాడు?

  • యెహోవా ప్రేమతో కేనన్‌కు ఎలా క్రమశిక్షణ ఇచ్చాడు?

  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ప్రేమించడం నేర్చుకోండి

    కేనన్‌ అనుభవం నుండి మనమేం నేర్చుకోవచ్చు?