కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

“చివరి రోజుల” ముగింపు కాలంలో సిద్ధంగా ఉండండి

“చివరి రోజుల” ముగింపు కాలంలో సిద్ధంగా ఉండండి

“చివరి రోజుల” ముగింపులో ఉన్నాం కాబట్టి మనకు కష్టాలు మరింత ఎక్కువౌతాయి. (2తి 3:1; మత్త 24:8) ఏదైనా విపత్తు జరిగినప్పుడు, ప్రాణాల్ని కాపాడే నిర్దేశాల్ని యెహోవా ప్రజలు సరైన సమయంలో అందుకుంటారు. అయితే, మనకు ఇప్పుడు ఇవ్వబడుతున్న నిర్దేశాలను పాటిస్తూ ఆధ్యాత్మికంగా, భౌతికంగా సిద్ధంగా ఉంటేనే రేపు విపత్తు వచ్చినప్పుడు ప్రాణాల్ని కాపాడుకోగలుగుతాం.—లూకా 16:10.

  • ఆధ్యాత్మికంగా ఎలా సిద్ధపడవచ్చు: ప్రతీరోజు బైబిలు చదవండి, క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయండి. వేర్వేరు పద్ధతుల్లో ప్రీచింగ్‌ చేయడం నేర్చుకోండి. మీరు వేరైపోయి సంఘంలోని సహోదర సహోదరీలను తాత్కాలికంగా కలవలేకపోతే కంగారుపడకండి. (యెష 30:15) ఎందుకంటే, యెహోవా నుండి యేసు నుండి మీరెప్పటికీ వేరుకాలేరు.—od 176వ పేజీ, 15-17 పేరాలు

  • భౌతికంగా ఎలా సిద్ధపడవచ్చు: ప్రతీ ఒక్కరికీ గో-బ్యాగ్‌ ఉండాలి. దాంతోపాటు, ఒకేచోట ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే, అప్పుడు ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రతీ ఇంట్లో తగినంత ఆహారం, నీళ్లు, మందులు, ఇతర వస్తువులు నిల్వ ఉంచుకోవాలి.—సామె 22:3; g4⁄07 24వ పేజీలోని బాక్సు

ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • విపత్తులను ఎదుర్కోవడానికి మనం ఆధ్యాత్మికంగా ఎలా సిద్ధపడవచ్చు?

  • మన గురించిన సమాచారాన్ని సంఘపెద్దలకు ఎప్పటికప్పుడు ఎందుకు చెప్తూ ఉండాలి?

    • ఒక ఎమర్జెన్సీ కిట్‌ను ఎందుకు సిద్ధంగా ఉంచుకోవాలి?

    • ఎలాంటి విపత్తులు జరగవచ్చో, అవి జరిగినప్పుడు ఏం చేయాలో కుటుంబ సభ్యులు ముందే ఎందుకు మాట్లాడుకోవాలి?

  • ఏదైనా విపత్తు జరిగినప్పుడు మనం వేరేవాళ్లకు సహాయం చేయగల మూడు పద్ధతులు ఏంటి?

ఇలా ప్రశ్నించుకోండి, ‘సిద్ధంగా ఉండడానికి సంబంధించి కోవిడ్‌-19 కాలంలో నేను ఏ పాఠాలు నేర్చుకున్నాను?’